Begin typing your search above and press return to search.

అమ్మడికి ఎక్కడా చోటు దొరకలేదా అలా చేసింది!!

By:  Tupaki Desk   |   19 March 2021 11:00 PM IST
అమ్మడికి ఎక్కడా చోటు దొరకలేదా అలా చేసింది!!
X
ఇండస్ట్రీలో అదృష్టం అనేది ఖచ్చితం అని భావిస్తారు పలువురు హీరోయిన్లు. అనుకోకుండా ఓ సినిమా హిట్టవడం.. అందులో నటించిన హీరోయిన్లకు రాత్రికి రాత్రే స్టార్స్ అవ్వడం.. తెల్లవారితే అవకాశాలు ఇలా టకటకా అయిపోతుంటాయి. మరి ఎన్ని అవకాశాలు వచ్చినా కథల ఎంపిక సరిగ్గా లేక కెరీర్ త్వరగా క్లోస్ చేసుకుంటారు. సూటిగా చెప్పాలంటే.. ఎంత త్వరగా ఎదుగుతారో.. ఫ్లాప్ లతో అంతే వేగంగా కిందికి పడిపోతారు. కానీ ఇవన్నీ ఇండస్ట్రీలో మాములే. ప్రస్తుతం హీరోయిన్ హెబ్బా పటేల్ పరిస్థితి ఇలాగే ఉంది. 'అలా ఎలా' మూవీతో తెలుగులో అడుగుపెట్టింది హెబ్బా. తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా సక్సెస్ ట్రాక్ ఎక్కింది.

అలా రెండు మూడు విజయాలు హెబ్బా ఖాతాలో పడ్డాయి. కానీ ఇప్పటివరకు అగ్రహీరోల సరసన ఛాన్స్ పొందలేకపోయింది. అలాగే ఇన్నేళ్లలో స్టార్ హీరోయిన్ అనే స్టేటస్ కూడా చేరలేకపోయింది. కొంతకాలంగా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో హెబ్బాకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. చేసేదేమీ లేక అమ్మడు ఐటెం సాంగ్స్, గెస్ట్ రోల్స్ చేస్తోంది. గతేడాది 'భీష్మ' సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. తర్వాత రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాలో కూడా గెస్ట్ రోల్ ప్లే చేసింది. ఈ ఏడాది రామ్ రెడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇలా ప్రస్తుతం కెరీర్ నెట్టుకొస్తుంది. తాజాగా అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా కాఫీ తాగుతున్న పిక్ షేర్ చేసింది. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనిపించవచ్చు. కానీ అమ్మడు ఎర్రచీర కట్టుకొని చీకట్లో చెట్టు పై నిలబడి తాగుతూ పోజిచ్చింది. ప్రస్తుతం హెబ్బాను చెట్టు పై నిలబడటం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.