Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఘాటైన పాత ఫోటో

By:  Tupaki Desk   |   10 March 2018 7:31 AM GMT
ఫోటో స్టోరి: ఘాటైన పాత ఫోటో
X
హెబ్బా పటేల్ ఎవరంటే కొంచెం ఆలోచించాలి. కానీ కుమారి 21F పిల్ల ఎవరంటే మాత్రం సడన్ గా పేరు గుర్తొస్తుంది. అంతలా అందరికి దగ్గరైన హెబ్బా మొదటి తెలుగు సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ అందుకుంది. సినిమా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్స్ కి ఇక పోటీ తప్పదని అంతా అనుకున్నారు. కానీ అనుకున్నంత రేంజ్ లో అమ్మడు అవకాశాలను అందుకోలేదు.

ఆ తరువాత వచ్చిన సినిమాలు కూడా పెద్దగా ఉపయోగపడలేదు. అయితే హెబ్బా ఆఫర్స్ వచ్చినా రాకపోయినా కూడా ఏ విధంగాను నిరాశ చెందలేదు. చిన్న సినిమాలైనా సరే కథ నచ్చితే చేయడానికి సిద్దపడుతోంది. అయితే సినిమాల సంగతి అటుంచితే.. అమ్మడి అందానికి సోషల్ మీడియాలో గట్టి టాక్ ఉంది. ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా సెక్సీ హాట్ అనే ఘాటైన పదాలు అందకుండా ఉండవు.

రీసెంట్ గా హెబ్బా తన పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్ ఎప్పటిలానే ఘాటైన పదాలతో పొగడ్తలతో ముంచెత్తారు. ఫ్యాషన్ డ్రెస్ లో హార్ట్ క్లివేజ్ షోను టచ్ చేసి ఉన్న ఆ స్టీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్కరు కూడా హెబ్బా పటేల్ పై నెగిటివ్ కామెంట్ చేయలేదు అంటే ఫొటో ఏ స్థాయిలో హీట్ ని రేపుతోంది అర్ధం చేసుకోవచ్చు.