Begin typing your search above and press return to search.

సొగసులు కొసరడంలో అబ్బా.. అనిపిస్తున్న హెబ్బా..!

By:  Tupaki Desk   |   7 April 2021 2:30 AM GMT
సొగసులు కొసరడంలో అబ్బా.. అనిపిస్తున్న హెబ్బా..!
X
సినీఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్ సైలెంట్ గా ఊరుకుంటే అభిమానులు అసలు ఊరుకోలేరు. ఎందుకంటే అంతలా హీరోయిన్స్ గ్లామర్ ను ఆరాధించే ఆరాధ్యులు లక్షల్లో ఉంటారు. అలాంటి అభిమానులను కలిగి ఉన్నటువంటి హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ అందరిలోకెల్లా కొందరిని మాత్రమే ఫ్యాన్స్ బాగా దగ్గరగా భావిస్తారు. అలాంటి కొందరిలో ఒకటి హెబ్బాపటేల్. ఈ వయ్యారి చూడటానికి బొద్దుగా కనిపిస్తుంది కానీ ఆమెలో గ్లామర్ పాళ్ళు మాత్రం ఓ రేంజిలో ఉన్నాయని చాలాసార్లు నిరూపించింది. తెలుగులో చాలా సినిమాలే చేసింది కానీ హెబ్బా ఇప్పటివరకు సరైన గుర్తింపు దక్కించుకోలేదు. మరి తెలుగులో కాకుండా వేరే ఇండస్ట్రీలో అయినా స్టార్డం అందుకుందా అంటే అదీలేదు.

ప్రస్తుతం సినిమాలు లేక వయ్యారి ఫోటోషూట్స్, స్పెషల్ సాంగ్స్ అంటూ కానిచ్చేస్తుంది. కళ్ళప్పగించి చూసేందుకు ఆకట్టుకునే అందం ఉన్నప్పటికీ మరి అభినయలోపమో.. ఏమోగాని కొంతకాలంగా హెబ్బా లీడ్ హీరోయిన్ క్యారెక్టర్స్ లో కనిపించడం లేదు. మరి వరుసగా సైడ్ క్యారెక్టర్స్ అయినా చేస్తుందా అంటే అలాకూడా బిజీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ప్రదర్శనతో మెరుపులు మెరిపిస్తోంది. అంటే సినిమాల్లో తన సోయగాలను చూపెందుకు అవకాశాలు రాకపోయినా స్వయంగా ఇంస్టాగ్రామ్ వేదికగా సొగసరి సొగసులను విరివిగా కొసరుతుంది. తాజాగా హెబ్బా.. చూడగానే అబ్బా అనిపించే రేంజిలో ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు టాప్ టు బాటమ్ వైట్ డ్రెస్ అండ్ జ్యువలరీతో ఆకర్షిస్తుంది. అలాగే మెల్లగా అందాలను ఆరబోసే ప్రయత్నం కూడా చేసినట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.