Begin typing your search above and press return to search.

ఆ పిల్లోడి పక్కన హెబ్బా సూటవుతుందా?

By:  Tupaki Desk   |   21 May 2016 1:30 PM GMT
ఆ పిల్లోడి పక్కన హెబ్బా సూటవుతుందా?
X
గత ఏడాది ‘వినవయ్యా రామాయ్యా’ అంటూ ఓ సినిమా వచ్చింది గుర్తుందా..? ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ కొడుగ్గా నటించిన పిల్లోడే ఈ సినిమాతో హీరో అయ్యాడు. అతడి పేరు నాగ అన్వేష్. ఆ కుర్రాడి తండ్రి సింధూరపువ్వు నిర్మాత కృష్ణారెడ్డి. హీరోగా అన్వేష్ తొలి సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు. పబ్లిసిటీ కూడా బాగా చేశారు. కానీ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో రిజల్ట్ తేడా కొట్టేసింది. ఐతే ఈసారి బాగా గ్యాప్ తీసుకుని.. చాలా కథలు విన్న అన్వేష్.. చివరికి రాజమౌళి శిష్యుడు పళని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా కన్ఫమ్ అయింది.

అలా ఎలా.. కుమారి 21 ఎఫ్.. ఈడోరకం ఆడోరకం.. లాంటి వరుస హిట్లతో ఊపుమీదున్న హెబ్బా పటేల్ అన్వేష్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది. ఐతే అన్వేష్ మరీ పిల్లోడిలా ఉంటాడు. అతడి తొలి సినిమాలో నటించిన కృతిక జయకుమార్ కూడా అతడి పక్కన కొంచెం పెద్దదిలాగే కనిపించింది. మరి హెబ్బా అతడి పక్కన ఎలా ఉంటుందో అని డౌట్ కొడుతోంది. రాజ్ తరుణ్ పక్కన కూడా ఆమె పెద్దదిలాగే అనిపించింది. అన్వేష్ పక్కన ఆమె ఎలా ఉంటుందో కానీ.. హెబ్బాకు నెమ్మదిగా మంచి మంచి ఛాన్సులే వస్తున్నాయి. ఆల్రెడీ ఆమె ప్రధాన పాత్రలో ‘నేను నా బాయ్ ఫ్రెండ్స్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు వరుణ్ తేజ్ ‘మిస్టర్’ సినిమాలోనూ ఓ హీరోయిన్ గా నటిస్తోంది హెబ్బా.