Begin typing your search above and press return to search.

నిఖిల్‌ తో చిందేయనున్న కుమారి

By:  Tupaki Desk   |   9 Dec 2015 5:27 AM GMT
నిఖిల్‌ తో చిందేయనున్న కుమారి
X
ఒక్క ఐడియా జీవితాన్నే చేంజ్‌ చేస్తుంది. స్టార్ రైట‌ర్ కం డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మాత‌గా తెర‌కెక్కించిన కుమారి 21 ఎఫ్ చిత్రంలో అవ‌కాశం అందుకున్న హేబా ప‌టేల్ లైఫ్ ఒక్క‌సారిగా మారిపోయిందిప్పుడు. సుకుమార్ హీరోయిన్ ఏంటి? ఇలా ఉంది అన్న‌వాళ్లంతా ఆ సినిమా చూశాక‌.. అస‌లు హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అని మెచ్చుకున్నారు. హేబా ప‌టేల్ ది బెస్ట్ ఆప్ష‌న్ అంటూ చెప్పుకున్నారు.

స‌రిగ్గా ఇదే హేబాకి టాలీవుడ్‌ లో దూసుకుపోయే ఛాన్సులిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు యంగ్ హీరో నిఖిల్ స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కింది. టైగ‌ర్ ఫేం ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రంలో నాయిక‌గా అవ‌కాశం అందుకుంది. ఈ చిత్రంలో అవికాగోర్ తో క‌లిసి మ‌రో నాయిక‌గా ఆడిపాడుతోంది. ఇంకొన్ని ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాల్లో హేబా నాయిక‌గా న‌టించ‌బోతోంది. ఒక్క కుమారి హేబా జీవితాన్నే మార్చేసింది మ‌రి.

అలా ఎలా సినిమాతో బ్రేక్‌ రాకపోయినా.. హేబాకి రెండవ విజ‌యం కుమారి 21 ఎఫ్‌ క‌లిసొచ్చింది. ఇప్పటికే అమ్మడు రాజ్‌ తరుణ్‌ తో విష్ణు మంచు సినిమాలో నటించేస్తోంది. వెనువెంటనే నిఖిల్‌ తో అంటే.. ఇది ఇంకా లక్కు మరి.