Begin typing your search above and press return to search.

మెగా హీరో.. ఆ హీరోయిన్‌ ను తీసేశాడా?

By:  Tupaki Desk   |   7 May 2016 12:11 PM GMT
మెగా హీరో.. ఆ హీరోయిన్‌ ను తీసేశాడా?
X
అందరూ జూన్‌ 1వ వారం నుండి మొదలయ్యే వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా కోసం ఈగర్‌ గా వెయిట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీను వైట్ల డైరక్ట్‌ చేయనున్నాడు. ఎందుకోగాని.. ఫోటో షూట్‌ చేశాక ఈ సినిమా నుండి కాజల్‌ ను తప్పించేశారు. చివరకు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి అండ్‌ హెబ్బా పటేల్‌ లు హీరోయిన్లుగా ఫిక్సయ్యారని తెలిసింది. అయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్‌ కూడా మారనుందట.

అందాల రాక్షసి అయితే ఫిక్స్‌ కాని.. హెబ్బా పటేల్‌ మాత్రం మారే ఛాన్సుందంటున్నారు. కారణాలు తెలియవు కాని.. హీరో కంటే హెబ్బా పటేల్‌ హైట్‌ లో చాలా తేడా ఉంది అనే నెపంతో ఈ మెగా ప్రిన్స్ సినిమాలో నుంచి ఆ కుమారి 21 ఎఫ్‌ ఫేం ప్రిన్సెస్‌ ను తప్పించే ఛాన్సుందట. ఆల్రెడీ వేరే ఆప్షన్‌ కోసం వెతుకుతున్నారు. 100కు 100 శాతం ఈ పాత్రకు రెజీనాను తీసుకుందాం అని ఫిక్సయినట్లు కొందరు చెబుతున్నారు.

ఏదేమైనా హెబ్బా పటేల్‌ కు ఇది గోల్డెన్‌ ఆఫర్. కాని చేజారిపోవడం అంటే మాత్రం కాస్త దురదృష్టదాయకం అనే చెప్పాలి. పోనివ్‌ లేండి.. వరుణ్‌ తేజ్‌ హైట్‌ ప్రాబ్లంతో ఈమెను తప్పిస్తే.. ఎలాగో శిరీష్‌ ఉన్నాడుగా.. ఒక ఛాన్సిస్తాడేమో!!