Begin typing your search above and press return to search.

హేభా పటేల్.. ఆ షో మొదలుపెట్టేసింది

By:  Tupaki Desk   |   17 May 2016 1:30 PM GMT
హేభా పటేల్.. ఆ షో మొదలుపెట్టేసింది
X
అంతకు ముందే అరంగేట్రం చేసినా హేభా పటేల్ ని కుమారి 21ఎఫ్ తిరుగులేని హీరోయిన్ ని చేసేసింది. యంగ్ సుందరాంగుల్లో ఆమెకు స్పెషల్ క్రేజ్ సంపాదించి పెట్టింది. కుమారి 21ఎఫ్ తర్వాత.. ఈడో రకం ఆడో రకం కూడా విజయం సాధించడంతో.. లక్కీ గాళ్ అనే స్టాంప్ కూడా వేయించేసుకుంది హేభా.

గ్లామర్ షో విషయంలో ఈ భామ ఇప్పటివరకూ పొదుపు పాటించిన దాఖలాలు లేవు కానీ.. మరీ శృతి మించిన సందర్భాలు కూడా లేవు. ఇప్పటివరకూ అందాల ప్రదర్శనలో ఆరితేరిన భామ అనిపించుకుందే తప్ప.. గీత దాటిన దాఖలాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడా హద్దును చెరిపేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. రీసెంట్ రెడ్ మేగజైన్ కవర్ పేజ్ కోసం అమ్మడు ఇచ్చిన పోజ్ చూస్తే.. మతులు పోవడం ఖాయం. హేభా అందాల ఆరబోతను చూసి కుమారిలో ఇన్ని కళలున్నాయా అని అభిమానులు అనుకుంటున్నారు.

వరుసగా సక్సెస్ లు సాధించినా ఇప్పటివరకూ హేభా పటేల్ కు భారీ ఆఫర్స్ ఏమీ రాలేదు. వచ్చిన ఛాన్సులన్నీ కుర్రహీరోలవే తప్ప.. స్టార్లెవరూ అమ్మడిని పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు రూట్ మార్చిందని, గ్లామర్ షో విషయంలో తన రేంజ్ చూపించేందుకే ఇలా డోస్ పెంచిన ఎక్స్ పోజింగ్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఏమైనా.. టాప్ హీరోయిన్ రేస్ లో అడుగు పెట్టడానికి ఏం చేయాలో తొందరగా తెలుసుకుంది హేభా పటేల్.