Begin typing your search above and press return to search.

హెబ్బా ప్లేట్ మార్చేసింది..

By:  Tupaki Desk   |   19 Dec 2016 7:30 AM GMT
హెబ్బా ప్లేట్ మార్చేసింది..
X
ఎన్ని హిట్స్ ఉన్నా స్టార్ హీరోల పక్కన ఆఫర్స్ వస్తేనే పెద్ద హీరోయిన్ అన్న పేరు.. టాప్ స్టేటస్ వచ్చేది. అందుకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతీ హీరోయిన్ పెద్ద హీరోలకి సోప్ వేస్తుంటారు. పలానా హీరో నా ఫేవరెట్ అంటూ చిలక పలుకులు పలుకుతుంటారు. వాళ్ల నుంచి ఎంతకీ పిలుపు రాకపోతే మైలేజీ ఉన్న మరో హీరో పేరు చెప్పేస్తారు. వరస హిట్లతో జోష్ మీదున్న హెబ్బా పటేల్ కూడా ఇప్పుడు ఇలాగే ప్లేట్ మార్చేసింది. సినిమాల్లో బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేసినట్టే ఇప్పుడు ఫేవరెట్ హీరోల పేర్లు ఛేంజ్ చేసింది.

మొన్నటిదాకా మెగా ఫ్యామిలీ జపం చేసింది ఈ కుమారి. అల్లు అర్జున్ దగ్గర్నుంచి సాయి ధరమ్ వరకు అందర్ని పొగిడేసింది. ఎందుకంటే ఒక్కసారి మెగా క్యాంప్ లోకి ఎంటరైతే ఏ హీరోయిన్ ఫేట్ అయిన మారిపోయినట్టే. ఒకరి తర్వాత ఒకరు ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. అంటే ఎంత లేదన్నా చేతిలో ఆరు సినిమాలు ఉన్నట్టే. అందుకే ఇండస్ట్రీకి వచ్చిన ఏ హీరోయిన్ అయినా మెగా జపం చేయడం ఖాయం. హెబ్బా పటేల్ కూడా అదే చేసింది. పైగా వరుణ్ తేజ్ తో మిస్టర్ లో నటిస్తుండటంతో మిగిలిన మెగా హీరోల్ని కూడా కాక పడితే వాళ్ల పక్కన ఆఫర్స్ అందేసుకోని మెగా క్యాంప్ లోకి ఎంటర్ అవ్వొచ్చని ఆశ పడింది.

మరి ప్రయత్నాలు ఫలించలేదో. ఎంత ట్రై చేసినా అట్నుంచి రియాక్షన్ రాలేదో కానీ ఇప్పుడు హెబ్బా టోన్ మారిపోయింది. ఫేవరెట్ హీరో ఎవరు అంటే చాలామంది లాగే మహేష్ బాబుతో పాటు స్మాల్ హీరోస్ లో బిగ్ స్టారైన నాని పేరు కూడా చెబుతోంది. వీళ్లతో నటించే ఛాన్స్ రావాలే కానీ క్షణం కూడా ఆలోచించే ప్రసక్తి లేదనేసింది. నాని సంగతొదిలేస్తే మహేష్ కుమారిని పట్టించుకుంటాడా అనేదే అసలు డౌట్. అందుకే వీళ్లు కూడా ఆఫర్స్ ఇవ్వకపోతే నెక్ట్స్ ఇంకో లిస్ట్ ప్రిపేర్ చేస్తుందేమో అని కామెంట్ చేస్తున్నారు కొందరు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/