Begin typing your search above and press return to search.

వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకుంటున్న కుమారి

By:  Tupaki Desk   |   26 March 2016 11:30 AM GMT
వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకుంటున్న కుమారి
X
కుమారి 21ఎఫ్ తర్వాత హీరోయిన్ హేభా పటేల్ కు డిమాండ్ బాగానే పెరిగింది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈమెను హీరోయిన్ గా కన్సిడర్ చేస్తున్నారనే వార్తలు ఎక్కువగానే వస్తున్నాయి. అంత స్పీడ్ గా సినిమాలు చేయకపోయినా.. ఈమె చేతిలో ఆఫర్లు మాత్రం ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం నిఖిల్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది హేభా.

కుమారి 21ఎఫ్ లో మోడల్ పాత్రలో ఆకట్టుకున్న హేభా.. నిఖిల్ మూవీలో డ్యాన్సర్ రోల్ లో నటిస్తోందని సమాచారం. ఈ కేరక్టర్ ప్రకారం వెస్ట్రన్ డ్యాన్స్ చేయాల్సి ఉంటుందట. అందుకే ఈ పాత్ర కోసం ప్రతీ రోజూ డ్యాన్స్ తెగ ప్రాక్టీస్ చేసేస్తోందని అంటున్నారు. రెగ్యులర్ గా చేసే ఫిట్నెస్ ఎక్సర్ సైజులతో పాటు.. డ్యాన్స్ ప్రాక్టీస్ ని కూడా తన షెడ్యూల్ లో చేర్చేసుకుందట కుమారి హీరోయిన్.

ఈ వెస్ట్రన్ డ్యాన్స్ ని ఆన్ స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా చూపించేందుకు రెగ్యులర్ ట్రైనింగ్ కూడా తీసుకుంటూ ఉండడం విశేషం. సినిమాకి అవసరమైనంత మేరకు.. స్టెప్స్ ను పర్ఫెక్ట్ గా వేసేలా ఈ ట్రైనింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే 40శాతం పైగా షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు మేకర్స్. ఏ మాత్రం హైప్ క్రియేట్ చేయకుండా ఇలా సినిమా షూటింగ్ చేయడానికి ప్రధానమైన కారణం ఉందని.. సినిమా రిలీజ్ టైంలో దీన్ని రివీల్ చేస్తారని తెలుస్తోంది.