Begin typing your search above and press return to search.

కుమారి ఎన్టీఆర్ మరదలైపోయింది

By:  Tupaki Desk   |   5 Jan 2016 5:30 PM GMT
కుమారి ఎన్టీఆర్ మరదలైపోయింది
X
లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా రావడం అంటే ఎలా ఉంటుందో కుమారి హీరోయిన్ హేభా పటేల్ ని చూస్తే అర్ధమవుతుంది. ఇలా నవంబర్ లో కుమారి 21ఎఫ్ రిలీజ్ అయ్యిందో లేదో.. అంతలోనే కుర్రకారులో ఈమెకు తెగ క్రేజ్ వచ్చేసింది. బోల్డ్ కేరక్టర్ లో ఇరగదీసేయడంతో.. యూత్ అంతా కుమారి కేరక్టర్ ని, ఆ రోల్ ని చేసిన హేభాను తెగ గుర్తు పెట్టేసుకున్నారు.

ఇంతగా ఆదరణ పొందిన అమ్మాయికి నెక్ట్స్ ఛాన్స్ ఎలా ఉంటుందో అనుకుంటే.. అంతలోనే ఈ 23 ఏళ్ల కుర్ర కుమారికి బంపర్ ఆఫర్ వచ్చేసింది. మొదటి సినిమాని సుకుమార్ నిర్మాణంలో చేస్తే, రెండో మూవీకి సుకుమార్ డైరెక్షన్ లో చేసేయగలిగింది. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన నాన్నకు ప్రేమతో చిత్రంలో రోల్ పట్టేసింది. జూనియర్ పక్కన మెరిసే ఛాన్స్ రావడమంటే.. స్టార్ హీరోయిన్ అవడానికి అడుగులు పడిపోయినట్లే. అంత పెద్ద లక్కీ ఛాన్స్ ని రెండో సినిమాకే దక్కించుకోవడం.. కుమారి హేభా పటేల్ ట్యాలెంట్ కి నిదర్శనంగా చెప్పాలి.

నాన్నకు ప్రేమతో మూవీలో హేభా చేస్తున్న కేరక్టర్ జూనియర్ మరదలు రోల్. ఇదేమీ చిన్న రోల్ కాదు.. ఈమె కోసం క్రియేట్ చేసింది అంతకన్నా కాదు. స్టోరీని పలుమార్లు టర్న్ తిప్పేసే కీలక పాత్ర అంటున్నారు. ఈ రోల్ ని ఎవరైనా స్టార్ హీరోయిన్ తో చేయిద్దామని మొదట అనుకున్నా.. చివరలో లక్కీగా ఈ ఆఫర్ హేభా పటేల్ కి దక్కేసింది. మరి రెండో సినిమాతో కూడా హిట్ కొట్టేస్తే, టాలీవుడ్ లో తన స్థానాన్ని పర్మనెంట్ గా సెట్ చేసేసుకునేందుకు.. హేభా పటేల్ కు మంచి అవకాశం దక్కినట్లే.