Begin typing your search above and press return to search.

వెబ్‌ సిరీస్‌ ను నమ్ముకున్న మరో హీరోయిన్‌

By:  Tupaki Desk   |   19 Dec 2019 7:44 AM GMT
వెబ్‌ సిరీస్‌ ను నమ్ముకున్న మరో హీరోయిన్‌
X
ఒకప్పుడు కొత్త వారు మరియు ఫేమ్‌ లేని వారు మాత్రమే వెబ్‌ సిరీస్‌ లలో చేసేవారు. కాని ఇప్పుడు స్టార్స్‌ మరియు సూపర్‌ స్టార్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌ లపై ఆసక్తి చూపుతున్నారు. సినిమాల స్థాయి లో వెబ్‌ సిరీస్‌ లను చేస్తున్నారు. దాంతో స్టార్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌ లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక సినిమాల్లో ఛాన్స్‌ లేని హీరోయిన్స్‌ మరియు నటులకు వెబ్‌ సిరీస్‌ లు ఒక వరంగా మారాయి. పలువురు హీరోయిన్స్‌ వెబ్‌ సిరీస్‌ బాట పడుతున్నారు.

ప్రస్తుతం సమంత కూడా ఒక వెబ్‌ సిరీస్‌ ను చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ కూడా వెబ్‌ సిరీస్‌ ను చేస్తోంది. ఇక వీరి జాబితాలో ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ కూడా చేరింది. కుమారి 21ఎఫ్‌ చిత్రంతో ఒక్కసారి గా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా కూడా పెద్దగా సక్సెస్‌ లు దక్కించుకోలేక పోయింది. అడపా దడపా చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం నితిన్‌ చిత్రంలో నటిస్తుంది.

ఒక వైపు హీరోయిన్‌ గా చేస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్‌ ను చేసేందుకు కమిట్‌ అయ్యింది. అజయ్‌ భుయాన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న వెబ్‌ సిరీస్‌ తో హెబ్బా పటేల్‌ తన కొత్త జర్నీని ప్రారంభించబోతుంది. హీరోయిన్‌ గా వెండి తెరపై కమర్షియల్‌ గా సక్సెస్‌ కాలేక పోయిన ఈ అమ్మడు వెబ్‌ సిరీస్‌ లతో అయినా సక్సెస్‌ ను దక్కించుకుంటుందో చూడాలి.