Begin typing your search above and press return to search.

మత్తెక్కిస్తున్న కుమారి సైడు కోసేస్తోందిగా!

By:  Tupaki Desk   |   25 March 2020 1:40 PM GMT
మత్తెక్కిస్తున్న కుమారి సైడు కోసేస్తోందిగా!
X
కుమారి కెరీర్ ఒడిదుడుకుల గురించి తెలిసిందే. `అలా ఎలా` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ముంబై హాట్‌ బాంబ్ హెబ్బా ప‌టేల్ తొలి సినిమాతో ఆక‌ట్టుకుని `కుమారి 21ఎఫ్‌`తో కుర్రాళ్ళకి కంటిపై కునుకు ప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చింది. తెర‌పై ఛాన్స్ దొరికినప్పుడల్లా తన నడుమందాలను చూపిస్తూ మతి పోగొట్టింది. మరోవైపు యంగ్ హీరో రాజ్‌ తరుణ్ తో లిప్‌ కిస్ లు లాగించేస్తూ చెల‌రేగి పోయింది. బోల్డ్ పాత్రతో హెబ్బా మైమరపించింది. దీంతో ఈ సెక్సీ భామ యూత్‌ కలల రాణిగా మారిపోయింది. ఆ తర్వాత కూడా చాలా బోల్డ్ గా ఉండే పాత్రలతో.. హెబ్బా అంటే బోల్డ్ రోల్స్ కే పరిమితం అనేలా చేసుకుంది. దీంతో వరుసగా అలాంటి ఆఫర్సే వస్తుండటంతో కొంత కాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. పైగా ఈ బ్యూటీ అమాయకత్వాన్ని ద‌ర్శ‌క నిర్మాతలు.. కొందరు హీరోలు కూడా బాగా వాడేసుకున్నారు. ఇలానే ఉంటే తన కెరీర్‌ ట్రాక్‌ తప్పుతుందని భావించిన ఈ హాట్‌ గర్ల్ కొన్నిరోజుల‌ విరామం తీసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు సినిమాలు చేయలేదు.

ఇప్పుడు తిరిగి పుంజుకుంటోంది. అవకాశాల వేటలో పడింది. అందులో భాగంగా తాజాగా ఓ ఫోటో షూట్ కి హెబ్బా అదిరిపోయే పోజులిచ్చింది. ఇందులో ఆమె ఓరచూపులతో క‌వ్విస్తున్నలుక్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. లంగా ఓణీలో వోణీ ఏమైందో కానీ.... మ‌త్తెక్కించే టాప్ ని ధరించి చిత్తు చేసే చూపులతో రెచ్చిపోతోంది. మామూలుగానే మత్తెక్కించేలా ఉండే హేబ్బా ఇలా వయ్యారంగా.. మైకం నిండిన చూపులతో అదోరకంగా చూస్తే ఏ కుర్రాడు అయినా కుదురుగా ఉండ‌గ‌ల‌డా?.

ఇక హెబ్బా కెరీర్‌ పరంగా చూస్తే... ఇటీవల `భీష్మ`లో గెస్ట్ రోల్ లో మెరిసిన ఈ ముంబయి భామ ప్రస్తుతం రాజ్‌ తరుణ్ తో మరోసారి `ఒరేయ్‌ బుజ్జిగా`లో కీలక పాత్ర పోషించింది. దీంతో పాటు రామ్‌ హీరోగా రూపొందుతున్న `రెడ్‌`లో ఐటెమ్‌ నెంబర్ లో తన గ్లామర్‌ షోతో మరింత కిక్కెంచేందుకు సిద్ధంగా ఉంది. హీరోయిన్ గా మాత్రం ఇప్పుడు హెబ్బాకి ఇప్పుడు ఒక్క ఆఫర్‌ కూడా లేకపోవడం విచారకరం.