Begin typing your search above and press return to search.

హీరోల్ని దించ‌డం అంత వీజీనా సారూ?

By:  Tupaki Desk   |   13 Jun 2020 9:45 AM IST
హీరోల్ని దించ‌డం అంత వీజీనా సారూ?
X
ప‌రిశ్ర‌మ‌కు ఎంద‌రో వ‌చ్చారు... వెళ్లారు. అలా వ‌చ్చి వెళ్లిన వాళ్ల‌లో దిగ్ధ‌ర్శ‌కులే ఉన్నారు. ఇండ‌స్ట్రీలో అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కులు.. అసాధార‌ణ ప్ర‌జ్ఞ‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన ద‌ర్శ‌కనిర్మాత‌లు ఉన్నారు. వీళ్ల‌లో కొంద‌రు హీరోల్ని అదుపులో ఉంచుకోవాల‌ని నానా ప్ర‌యాస‌లు ప‌డ్డారు. కానీ అనుకున్న‌ది మాత్రం సాధించ‌లేక‌పోయారు. తుదికంటా హీరోల్ని దించేందుకు ప్ర‌య‌త్నించినా ఆ ప‌ని చేయ‌లేక క‌నుమ‌రుగ‌య్యారు. ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు ఎన్నో వేదిక‌ల‌పై హీరోల్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రాన్ని.. పారితోషికాల్ని కోసేయాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పేవారు. కానీ ఏనాడూ ఆయ‌న క‌ల‌గ‌న్న‌ద జ‌ర‌గ‌లేదు.

అస‌లు హీరోలంతా ప‌రిశ్ర‌మ‌ని గుప్పిట ప‌ట్ట‌డం న‌చ్చ‌నివాళ్లు ఎంద‌రో ఉన్నారు. కానీ ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. ఎందుకంటే హీరోసామ్య ప‌రిశ్ర‌మ ఇది. హీరోని చూసే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారు. టిక్కెట్లు తెగుతాయి! అన్న భావ‌న ఉంది. ద‌ర్శ‌కులు ఎంత ప్ర‌తిభ చూపించినా.. నిర్మాత‌లు ఎంత డ‌బ్బు పెట్టినా కానీ వారికి గుర్తింపు సున్నా. మేమే ఇండ‌స్ట్రీని న‌డిపించేది! అన్న అహం హీరోల‌కు ఉండి తీరుతుంది.

అందుకే అగ్ర నిర్మాతలు హీరో ఎంత పారితోషికం అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. అస్స‌లు ఏమాత్రం ఎదురు చెప్ప‌రు. అయితే ప్ర‌స్తుత మ‌హ‌మ్మారీ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని నిర్మాత‌లు హీరోల్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. గ‌త కొంత‌కాలంగా ఈ క‌ష్ఠ‌కాలంలో నిర్మాతల్ని హీరోలు ఆదుకుంటార‌ని.. పారితోషికాలు త‌గ్గించుకుంటార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. కానీ హీరోల వైపు నుంచి అలాంటి అంగీకారం ఏదీ లేదు. అందుకే హీరోల పారితోషికాల్ని 20 -25 శాతం మేర‌ త‌గ్గించేందుకు.. ద‌ర్శ‌కులు 25 శాతం త‌గ్గించుకునేలా యాక్టివ్ నిర్మాత‌ల గిల్డ్ చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ట‌. ఇప్ప‌టికే అగ్రిమెంట్లు చేసుకున్న‌వి కాక‌.. తదుప‌రి ప్రారంభించ‌బోయే సినిమాల‌కు సంబంధించి ఏ హీరో అయినా ఆ మేర‌కు త‌గ్గించుకుని ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని రూల్ పాస్ చేయ‌నున్నార‌ట‌. అంతేకాదు.. హీరోల‌తో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు.. భారీ పారితోషికాలు అందుకునే టెక్నీషియ‌న్స్ కి ఇదే రూల్ వ‌ర్తింప‌జేయాల‌న్న ఆలోచన చేస్తున్నార‌ట‌.

అయితే హీరోలు పారితోషికాలు త‌గ్గించుకోవ‌డం అన్న‌ది అసాధ్యం అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏదో అడ్జ‌స్ట్ మెంట్ ఉంటుందేమో కానీ.. తగ్గింపు అన్న‌ది క‌ల్ల‌. అయితే హీరోలు త‌గ్గించుకున్నారు అని చెప్పుకుని ఇత‌రుల్ని త‌గ్గించ‌డం సాధ్య‌ప‌డుతుంది కాబ‌ట్టి గిల్డ్ ఇలాంటి ప్లాన్ వేసింద‌న్న గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.