Begin typing your search above and press return to search.

సమ్మర్ సినిమాల హీటు బాక్సాఫీస్ భరించడం కష్టమే!

By:  Tupaki Desk   |   5 Feb 2022 7:54 AM GMT
సమ్మర్ సినిమాల హీటు బాక్సాఫీస్ భరించడం కష్టమే!
X
పరీక్షల సమయంలో సినిమాల విడుదల తక్కువగా ఉండటం . వేసవి సెలవుల్లో సినిమాల జోరు ఎక్కువగా ఉండటం మొదటి నుంచి జరుగుతున్నదే. పరీక్షల తరువాత సినిమాలపై యూత్ ఎక్కువగా దృష్టిపెడుతుంది. అలాగే అప్పటివరకూ వాళ్ల చదువుపై దృష్టి పెట్టిన పేరెంట్స్ కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ వైపు ఓ లుక్ వేస్తారు. అందువలన సమ్మర్ సీజన్లో థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయి. అయితే ఈ సారి సమ్మర్లో సందడి మరింత ఎక్కువగా కనిపించనుంది. కరోనా కారణంగా రెండు సమ్మర్లు నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

ఇక సంక్రాంతికి థియేటర్లకు వద్దామనుకున్న 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' .. 'ఆచార్య' సినిమాలు సమ్మర్ కి వాయిదా పడ్డాయి. ఈ మూడింటిలో మొదటి రెండు పాన్ ఇండియా సినిమాలు కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక 'ఆచార్య' విషయానికి వచ్చేసరికి దానికి అయిన బడ్జెట్ తో సంబంధం లేదు. మెగాస్టార్ ఇమేజ్ ఒక్కటిచాలు .. అది పెద్ద సినిమా అని చెప్పుకోవడానికి. ఇక చరణ్ కూడా కీలకమైన పాత్ర చేయడం వలన, పాన్ ఇండియా సినిమాల స్థాయిలోనే 'ఆచార్య' కూడా కనిపిస్తోంది. ఇక ఈ వేసవిలోనే 'భీమ్లా నాయక్' రానుంది.

మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' బడ్జెట్ పరంగా చూసుకుంటే చిన్న సినిమానే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇటు పవన్ క్రేజ్ .. అటు రానా ఇమేజ్ కారణంగా ఇది కూడా భారీ సినిమా స్థాయిని సంతరించుకుని కనిపిస్తోంది. ఇక 'కేజీఎఫ్ 2' విషయానికి వస్తే .. ఈ సినిమాకి భాషతో సంబంధం అవసరం లేదనే అనిపిస్తుంది. అంతగా ఈ సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సమ్మర్లో ఈ సినిమా సంచలనాన్ని నమోదు చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఇక మహేశ్ బాబు 'సర్కారువారి పాట' .. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' .. వెంకటేశ్, వరుణ్ తేజ్ ల 'ఎఫ్ 3' సినిమాలు కూడా సమ్మర్ బరిలోకే దిగుతున్నాయి. ఈ మూడు సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటు మహేశ్ .. అటు రవితేజ .. వెంకీ వరుణ్ లు ఇంతకుముందు చేసిన సినిమాలు భారీ హిట్లను నమోదు చేసి ఉండటం ఈ సినిమాలకి కలిసొచ్చే అంశం. ఈ జాబితా చూస్తుంటే ఈ స్థాయిలో క్రేజీ ప్రాజెక్టులన్నీ కూడా ఒకే సీజన్లో థియేటర్లకు వస్తుండటం ఇదే మొదటిసారేమో అనిపిస్తోంది. ఇక ఈ హీటు మీద ఏయే సినిమాలు హిట్లు కొడతాయో చూడాలి.