Begin typing your search above and press return to search.

హార్ట్ ఆఫ్ స్టోన్ ట్రైలర్: క్యూటెస్ట్ విల‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ ఆలియా

By:  Tupaki Desk   |   18 Jun 2023 5:58 PM IST
హార్ట్ ఆఫ్ స్టోన్ ట్రైలర్: క్యూటెస్ట్ విల‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ ఆలియా
X
ఆలియా భట్ న‌టించిన తొలి హాలీవుడ్ చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంత‌కుముందు విడుద‌లైన పోస్ట‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ లో ఆలియా భట్ పాత్ర రివీలైంది. ఇదేమీ ఆషామాషీ రోల్ కాదు. ఆలియా ఇందులో విల‌న్ గా క‌నిపించ‌నుంది. గాడోట్ వ‌ర్సెస్ రాచెల్ వార్ న‌డుస్తుండ‌గానే మ‌ధ్య‌లో మ‌రో కీల‌క‌మైన విల‌న్ గా ఆలియా ఎంట్రీ ఇస్తుంది. ఆలియా పాత్ర పేరు కీయా ధావన్. గాల్ గాడోట్ పాత్ర ఏజెంట్ రాచెల్ స్టోన్ తో క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. టామ్ హార్పర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇద్దరు ప్రముఖ మహిళల మధ్య ఉత్కంఠభరితమైన ముఖాముఖితో ర‌క్తి క‌ట్టించ‌నుంది. రేచెల్ కీయా కనికరం లేని విల‌న్ గా క‌నిపించ‌నుంది.

జూన్ 17న బ్రెజిల్ లో జరిగిన టుడమ్ 2023 ఈవెంట్ సందర్భంగా ఆవిష్కరించిన‌ ట్రైలర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. `ది హార్ట్` అని పిలుచుకునే త‌న‌ సంస్థ విలువైన ఆస్తిని కాపాడుకునే ఏకైక ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ గా గాడోట్ పాత్ర ఇందులో ఆక‌ట్టుకుంటోంది. గాడోట్ పారాగ్లైడింగ్- మోటార్ సైకిల్ ఛేజ్ ల‌తో... తీవ్రమైన పోరాటాలు చేస్తూ ఎగ్రెస్సివ్ గా క‌నిపిస్తుంది. అలాగే ఇంత టెన్ష‌న్ లోను తేలికగా ఆనందించే క్షణాల మధ్య అప్రయత్నంగా మారడం ద్వారా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడం వంటి యాక్షన్ సన్నివేశాలు త‌న ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తాయి.

ట్రైల‌ర్ లో అలియా ప్రవేశం ఆకర్షణీయమైన చెడు కీయా ధావన్ తో స్నేహం చేయ‌డం దృష్టిని ఆకర్షించింది. ఆలియా ఆరంగేట్రంతో వీక్షకులు ఆమె అయస్కాంత ఉనికిని గాడోట్ వ‌ర్సెస్ రాచెల్ తో పాత‌ఘర్షణ వ్య‌వ‌హారాల్ని చూసి క‌థ‌లోకి వెళ‌తారు. ట్రైలర్ అభిమానుల్లో నిరీక్షణను తీవ్రతరం చేస్తుందన‌డంలో సందేహం లేదు. ఇద్దరు శక్తివంతమైన మహిళల మధ్య హైఎండ్ వార్ స‌న్నివేశాలతో స్క్రీన్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంది.

హార్ట్ ఆఫ్ స్టోన్ ప్రఖ్యాత మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కు సమానమైన ఫ్రాంచైజీని ప్రారంభించాలనే త‌పన‌తో మొద‌లు పెట్టిన‌ది. టామ్ హార్పర్ నేతృత్వంలో. స్టార్-స్టడెడ్ తారాగణంలో జామీ డోర్నాన్- సోఫీ ఒకోనెడో- మాథియాస్ ష్వీగోఫర్- జింగ్ లూసీ- పాల్ రెడీ ఉన్నారు. వీరు గాడోట్ - అలియాతో కలిసి ఒక ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించారు. ఇది ఆగస్టు 11 నుండి OTT ప్లాట్ ఫారమ్ లో ప్రసారం కానుంది.