Begin typing your search above and press return to search.

కండ‌ల హీరోతో నిండా ల‌వ్ లో మునిగిన హాటీ

By:  Tupaki Desk   |   27 April 2020 4:45 AM GMT
కండ‌ల హీరోతో నిండా ల‌వ్ లో మునిగిన హాటీ
X
ఇది ప్రేమికుల సీజన్. నులి వెచ్చ‌ని కౌగిలిలో జంట‌లు ఒదిగి పోతున్న సీజ‌న్. క్వారంటైన్ పేరుతో బోలెడంత ఎంజాయ్ మెంట్ దొరికింది. ఇక ఇదే లాక్ డౌన్ లో ప‌లువురు సెల‌బ్రిటీ జంట‌లు పిల్ల‌ల్ని క‌నే ప్లాన్ చేసుకున్నార‌ని తెలుస్తోంది. అదేమో కానీ.. ఇంకా సింగిల్ గానే ఉన్న అదాశ‌ర్మ ప‌రిస్థితేమిటి? అదాకి ఫిదా అంటూ సోష‌ల్ మీడియాల్లో సంద‌డి చేయ‌డం మాత్ర‌మేనా? జ‌త‌గాడిని వెతుక్కునేదేమైనా ఉందా? అంటే..అందుకు తాజాగా ఓ ఆస‌క్తిక‌ర లీక్ అందింది.

``నేను చాలామంది కుర్రాళ్ల‌ను ప్రేమించాను. ఆ లిస్ట్ త‌ర్వాత చెబుతాను!`` అంటూ కొంటెగా ట్వీటే అదా గ‌త కొంత‌ కాలంగా ఓ కండ‌ల వీరుడితో ల‌వ్ లో లాక్ అయిపోయింద‌న్న ప్ర‌చారం జోరెక్కిపోతోంది. ఇంత‌కీ ఎవ‌రా కండ‌ల హీరో అంటే.. పేరు విద్యుత్ జ‌మ్వాల్. ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన‌ `తుపాకి`లో విల‌న్ గా అతడు తెలుగు వారికి సుప‌రిచితం. ఆ త‌ర్వాతా ప‌లు సౌత్ సినిమాల్లో విల‌న్ గా మెరిసాడు. బాలీవుడ్ లో క‌మెండో సిరీస్ తో యాక్ష‌న్ హీరోగా స‌త్తా చాటుతున్నాడు.

కమెండో 2 .. క‌మెండో 3 ఇలా సిరీస్ చిత్రాల్లో విద్యుత్ న‌టించాడు. ఇక ఈ రెండు సినిమాల్లోనూ అదా శ‌ర్మ అత‌డి స‌ర‌స‌న న‌టించింది. క‌మెండో 2లో ‘తేరే దిల్ మెయిన్’ లాంటి బాలీవుడ్ స్టైల్ రొమాంటిక్ సాంగ్ లో అదా ఆర‌బోత తెలిసిందే. ఈ పాట‌లో విద్యుత్ - అదా మ‌ధ్య ల‌వ్ కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుటైంది. ఇక వ‌రుస‌గా రెండు సినిమాల్లో ఒకే జంట రిపీటైతే తెలిసిందే క‌దా! ఆ క్ర‌మంలోనే అదాశ‌ర్మ నిండా ప్రేమ‌లో మునిగింద‌ని విద్యుత్ జ‌మ్వాల్ తో చెట్టా ప‌ట్టాల్ అంటూ షికార్లు చేస్తోంద‌ని ప్ర‌చార‌మైంది. అయితే విద్యుత్ తో ప్రేమ నిజ‌మా? అంటే అదాశ‌ర్మ పెద‌వి మెద‌ప‌దు. కానీ విద్యుత్ మాత్రం అలాంటిదేమీ లేద‌ని న‌వ్వేస్తుంటాడు. లేదు! అంటే న‌మ్మేసే ప‌రిస్థితి జ‌నాల్లోనూ లేదు.