Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్సెస్ ని పెళ్లాడే రాకుమారుడు ఇత‌డే!

By:  Tupaki Desk   |   19 Jun 2020 2:45 AM GMT
మెగా ప్రిన్సెస్ ని పెళ్లాడే రాకుమారుడు ఇత‌డే!
X
మెగా ప్రిన్సెస్ నీహారిక కొణిదెల కాబోయే వ‌రుడు ఎవ‌రు? గ‌త రెండ్రోజులుగా ఇదే చ‌ర్చ‌. ఫ్యాన్స్ స‌హా యూత్ లో ఒక‌టే ఆస‌క్తిక నెల‌కొంది. త‌న‌కు `త‌గిన‌ వ‌రుడు దొరికాడు` అన్న హింట్ ని నీహారిక స్వ‌యంగా ఇచ్చిన క్ష‌ణం నుంచి ఇంత‌కీ పెళ్లికొడుకు ఎవ‌రై ఉంటారు? అంద‌గాడేనా? చ‌ందురూడేనా? కుటుంబ నేప‌థ్యం ఏమిటి? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా మెగాభిమానులు స‌హా కామ‌న్ జ‌నాల్లో ఆసక్తిక‌ర చ‌ర్చ సాగింది.

ఇంతకుముందు వ‌రుడి ముఖం క‌నిపించ‌కుండా వెన‌క వైపుగా ఉన్న ఫోటోని నీహారిక సోష‌ల్ మీడియాల్లో షేర్ చేశారు. నీహారిక సోషల్ మీడియా పోస్ట్ ని బ‌ట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు చిన్న హింట్ ఇచ్చిందని అర్థ‌మైంది. స్టార్ బక్స్ కాఫీ కప్ మీద 'Ms. Niha' అని రాసి ఉండగా 'Ms.'ని కొట్టేసి 'Mrs.' అని క్వశ్చన్ మార్క్ ( ? ) ఉన్న ఫోటోని నీహారిక షేర్ చేసింది. దానికి ''ఉహ్.. వాట్ ?'' అని కామెంట్ జత చేసింది. ఈ చిన్న క్లూతోనే చాలా వ‌ర‌కూ నీహారిక పెళ్లిపై క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో కుటుంబ స‌భ్యుల నుంచి అలాగే.. అభిమానుల నుంచి సామాజి మాధ్య‌మాల్లో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి.

ఇక వ‌రుడు అంద‌గాడేనా? ప‌్రిన్సెస్ కి త‌గిన ప్రిన్సేనా? అంటే ఇదిగో డైరెక్టుగా ఫోటో సాక్ష్య‌మే ల‌భించింది. అత‌డు అంద‌గాడే.. చందురూడే! మెగా ప్రిన్సెస్ ని పెళ్లాడేవాడు అచ్చం రాకుమారుడిలానే ఉన్నాడంటే అతిశ‌యోక్త కాదు. వైట్ ష‌ర్ట్ .. దానిపై బ్లాక్ సూట్ ధ‌రించ‌కుండా స్టైలిష్ గా చేత్తో ప‌ట్టుకుని .. వేరొక చేతిలో ఉన్న వాచ్ ని త‌థేకంగా చూస్తూ ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడు. చూస్తుంటే మెగా ఫ్యామిలీకి మ‌రో హీరో యాడైన‌ట్టే క‌నిపిస్తోంది. ఇంత‌కీ వ‌రుడి డీటెయిల్స్ ఏమిటో అంటే నీహారిక‌నే రివీల్ చేయాల్సి ఉంటుంది. లేదా మెగా బ్ర‌ద‌ర్ అయినా సోష‌ల్ మీడియాల్లో వెల్ల‌డిస్తారేమో చూడాలి. మొత్తానికి వ‌రుడి వేట‌లో రెండేళ్ల సెర్చ్ ఇప్ప‌టికి ఫ‌లించింద‌న్న‌మాట‌.