Begin typing your search above and press return to search.

బోల్డ్ బ్యూటీని ఒంట‌రిగా విదేశాల‌కు ర‌మ్మ‌న్నాడ‌ట‌!

By:  Tupaki Desk   |   5 March 2021 3:24 PM IST
బోల్డ్ బ్యూటీని ఒంట‌రిగా విదేశాల‌కు ర‌మ్మ‌న్నాడ‌ట‌!
X
రెండు నెల‌ల పాటు విదేశాల్లో షూటింగ్.. త్వ‌ర‌లోనే షూట్ కి జాయిన్ కావాల్సి ఉంది. అయితే త‌న‌తో సంర‌క్షకుడు ఎవ‌రూ లేకుండా ఒంట‌రిగా ర‌మ్మన్నార‌ట స‌ద‌రు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. అంతేకాదు.. త‌న‌కు మాత్ర‌మే విమానం టిక్కెట్- వీసా ప్లాన్ చేసి.. సంర‌క్ష‌కుడిని లైట్ తీస్కున్నారు.దీంతో స‌ద‌రు యంగ్ బ్యూటీ ఆ మూవీని లైట్ తీస్కుని షూటింగుకి వెళ్ల‌లేద‌ని తెలిసింది. అయితే త‌న‌ని ఒంట‌రిగా ర‌మ్మ‌న్నందునే షూటింగుకి ఎగ‌నామం పెట్టినా.. ఇప్పుడు త‌న రెండు నెల‌ల కాల్షీట్లు కోల్పోయినందుకు చాలా బాధ‌ప‌డిపోతోంద‌ట‌.

అయితే ముందు క‌మిటై ఆ త‌ర్వాత షూటింగ్ ఎగ్గొట్టినందుకు ఆ ద‌ర్శ‌నిర్మాత‌లు త‌న‌పై చాంబ‌ర్ కి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. కానీ అన్నిటికీ సిద్ధ‌ప‌డ్డాకే ఆ ఛాన్స్ వదులుకున్న‌ స‌ద‌రు యంగ్ బ్యూటీ త‌న ఆన్స‌ర్ కూడా రెడీ చేసి పెట్టుకుద‌ట‌. ఇదంతా ఓ పంజాబీ చిత్రం కోసం న‌డిచిన డ్రామా అని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో న‌టిస్తున్న స‌ద‌రు యంగ్ హీరోయిన్ కి బోల్డ్ ఇమేజ్ దృష్ట్యా ఇలాంటి ఆఫ‌ర్ వ‌చ్చి క్యాన్సిల్ అయ్యింద‌ని చెవులు కొరుక్కుంటున్నారు. త‌మ వారు ఎవ‌రూ లేకుండా ఈ క‌రోనా స‌మ‌యంలో విదేశాల‌కు వెళ్లాలంటే భ‌యం ఓవైపు.. పైగా ఒంట‌రిత‌నం ఫియ‌ర్స్ ఇంకోవైపు.. అందుకే ఆ ఛాన్స్ ని లైట్ తీస్కుంద‌ట‌.