Begin typing your search above and press return to search.
జీవితంలో ఎక్కువగా డైరెక్టర్లను నమ్మి మోసపోయా: హీరో విష్ణు
By: Tupaki Desk | 22 March 2021 11:00 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్ సినిమాలను ఫేస్ చేస్తున్న హీరోలు కొద్దిమంది ఉన్నారు. అలాంటి హీరోలలో ఒకరు మంచు విష్ణు. కొన్నేళ్లుగా విష్ణుకు ఓ మాదిరి హిట్ కూడా పడలేదు. చివరిగా ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ సినిమాలు వచ్చినప్పటికి ఘోరమైన ఫలితాన్ని తెచ్చిపెట్టాయి. ఆ వెంటనే విష్ణు కొంతకాలం దూరంగా వెళ్ళిపోయి ఎలాగైనా ఓ సాలిడ్ హిట్టు కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి కెరీర్ మొదలైన ఐదారేళ్లకు స్టార్ హీరోలుగా స్టేటస్ అందుకున్న వారున్నారు. కానీ విష్ణు విషయంలో అలా జరగలేదు. కెరీర్ పరంగా ఇప్పటికి స్ట్రగుల్ అవుతున్నాడు. ఇన్నేళ్లుగా విష్ణు ఆ ఫీట్ అందుకోలేకపోయాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. విష్ణు నుండి సినిమా వచ్చి రెండేళ్ల పైనే అవుతోంది.
కానీ ఇటీవల పక్కా ప్రణాళికతో మోసగాళ్లు సినిమా ప్లాన్ చేసుకున్నాడు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ కన్నడ భాషలలో రిలీజ్ చేసాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను కూడా లైఫ్ లో చాలామందిని నమ్మి మోసపోయినట్లు చెప్పుకొచ్చాడు విష్ణు. కెరీర్లో ఎక్కువగా డైరెక్టర్లను నమ్మి దెబ్బ తిన్నానని చెప్పాడు. గుడ్డిగా ఫాలో అవడం వలన ఇలా అయిందని.. ఇకపై ఇలాంటి మిస్టేక్ చేయనని తెలిపాడు. అలాగే ఇండస్ట్రీలో కళ్యాణ్ రామ్, ప్రభాస్ క్లోస్ అని. అందరితో బాగానే ఉంటానని అన్నాడు. అయితే చాలామందికి తను బార్బీక్యూ పద్ధతిలో వంట చేస్తానని చెప్పా.. ఈ విషయంలో మొన్న బన్నీ తిట్టాడు. టీజర్ లాంచ్ అన్నప్పుడు బార్బీక్యూ చేస్తానని అంటే.. చెప్తూనే ఉన్నావ్ గాని పిలవడం లేదంటూ సరదాగా అన్నాడని చెప్పుకొచ్చాడు విష్ణు. ప్రస్తుతం మోసగాళ్లు మూవీ చాలా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ఏమవుతుందో!