Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్'లో వారి ప్రాధాన్యత తగ్గించారా..?

By:  Tupaki Desk   |   15 Jan 2021 4:30 PM GMT
వకీల్ సాబ్లో వారి ప్రాధాన్యత తగ్గించారా..?
X
ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ కళ్యాణ్ తాజా చిత్రం 'వ‌కీల్ సాబ్‌'. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ - బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్‌ కు ట్రీట్ ఇచ్చేలా టీజ‌ర్‌ ను విడుద‌ల చేశారు. ప‌వ‌న్‌ సీరియ‌స్‌ గా కోర్టులో అబ్జ‌క్ష‌న్ యువ‌రాన‌ర్ అని డైలాగ్ చెప్ప‌డం.. మెట్రో ట్రైన్ లో విలన్స్ తో ఫైట్ చేయడం వంటి స‌న్నివేశాల‌తో టీజర్ అభిమానులను ఎంటర్టైన్ చేసింది. అయితే అదే సమయంలో 'వకీల్ సాబ్' కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

'వకీల్ సాబ్' సినిమా హిందీలో సూపర్ హిట్ అయిన 'పింక్' చిత్రానికి తెలుగు రీమేక్ అనే సంగతి తెలిసిందే. మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే ఈ కోర్ట్ డ్రామాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించారు. సినిమా స్టోరీ మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. అయితే నిన్న రిలీజ్ చేసిన 'వకీల్ సాబ్' టీజర్ లో అలాంటి అంశాలేవే ప్రస్తావించలేదు. కేవలం పవన్ ని ఎలివేట్ చేస్తూ యాక్షన్ సన్నివేశాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ మహిళల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో కూడా పవన్ నే హైలైట్ చేసిన చిత్ర బృందం.. ఇప్పుడు టీజర్ లో కూడా మహిళల ప్రాధాన్యత లేకుండా చేసారని 'పింక్' చిత్రాన్ని అభిమానించే వాళ్ళు అభ్యంతరం చెబుతున్నారు. నిజానికి తమిళ్ రీమేక్ లో కూడా అజిత్ స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకొని పలు చేంజెస్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు యాంటీ పీకే ఫ్యాన్స్ కూడా 'వకీల్ సాబ్' టీజర్ ని ఉద్దేశిస్తూ ఈ లాయర్ కేవలం విడాకుల కేసులను మాత్రమే వాదించగలడని ట్రోల్ చేస్తున్నారు.