Begin typing your search above and press return to search.

రిటైర్మెంట్‌ హోమ్‌ పై చిరు ఫ్యాన్స్ కి క్లారిటీ వ‌చ్చేసిందా?

By:  Tupaki Desk   |   16 Jan 2023 11:30 AM GMT
రిటైర్మెంట్‌ హోమ్‌ పై చిరు ఫ్యాన్స్ కి క్లారిటీ వ‌చ్చేసిందా?
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'వాల్తేరు వీర‌య్య‌'. సంక్రాంతి బ‌రిలో భారీ స్థాయిలో విడుద‌లైన ఈ మూవీ థియేట‌ర్ల‌లో అభిమానుల‌కు పూన‌కాలు తెప్పిస్తోంది. చిరుని చాలా ఏళ్ల త‌రువాత వింటేజ్ లుక్ లో చూడ‌టంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సినిమాకు బ్రహ్మ‌ర‌థం ప‌డుతున్నారు. బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో శృతిహాస‌న్ చిరుకు జోడీగా న‌టించింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ తాజాగా వంద కోట్ల క్ల‌బ్ లో చేర‌డం విశేషం.

ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి త‌న రిటైర్మెంట్ త‌రువాత ఏపీలోని భీమిలిలో సెటిలైతున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. భీమిలి రోడ్డులో కొంత స్థ‌లాన్ని కొన్నాన‌ని, త‌న రిటైర్మెంట్ హోమ్ క‌న్ స్ట్ర‌క్ష‌న్ ని త్వ‌ర‌లోనే ప్రారంభిస్తాన‌ని వెల్ల‌డించారు. దీంతో ర‌క ర‌కాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. హైద‌రాబాద్ లో స‌క‌ల సౌక‌ర్యాల‌తో సువిశాల‌మైన ఇల్లు వుండ‌గా చిరంజీవి ఏపీలోని భీమిలి రోడ్డులో ఇల్లు క‌ట్టుకోవ‌డం ఏంటీ? రిటైర్మెంట్ త‌రువాత ఏపీకి రావ‌డం ఏంటీ? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి.

ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ని మభ్య పెట్ట‌డంలో భాగంగానే చిరు ఇలా ప్ర‌క‌టించార‌ని కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా మ‌రో ఇంట‌ర్వ్యూలో దీనిపై చిరు ఇండైరెక్ట్ గా వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న‌కు ఓటు హ‌క్కు వున్న రాష్ట్రంలో తాను భాగం అని, పొరుగు రాష్ట్ర రాజ‌కీయాల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. అంతే కాకుండా పొరుగు రాష్ట్ర రాజ‌కీయాల‌పై తాను స్పందించ‌నున్నారు. ఈ నేఫ‌థ్యంలో వైజ‌గ్ లో సొంతంగా ఇల్లు నిర్మించాల‌నుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏంట‌ని ప‌లువురు చిరుని ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు.

భీమ‌లిలో మేము భూమిని కొన్నాం. అది పెద్ద విష‌యం ఏమీ కాదు. రామ్ చ‌ర‌ణ్ గోవాలోనూ ఇల్లు వుండాల‌ని కోరుకుంటున్నాడు. ఇప్ప‌టికే దానికి సంబంధించిన స‌న్నాహాలు మొద‌లు పెట్టాడు కూడా. అంతే కాకుండా ఊటీలోనూ ఓ ఇల్లు ఉండాల‌నుకుంటున్నాను. అది దాదాపుగా పూర్తయిపోయింద‌ని, ఈ రెండింటి త‌రువాతే వైజాగ్ లోని భీమ‌లి రోడ్డులో ఇల్లు నిర్మిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు చిరు. చిరు ప్ర‌క‌ట‌న‌తో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గుర‌వుతున్నార‌ట‌. కార‌ణం ఇత‌ర రాష్ట్రాల్లో ఎలాగైతే చిరు, చ‌ర‌ణ్ ప్ర‌త్యేకంగా ఇల్ల‌ని నిర్మిస్తున్నారో అలాగే ఏపీలోనూ నిర్మించాల‌నుకుంటున్నార‌ని, అంతే కానీ ఏపీకి షిఫ్ట్ కావాల‌న్న ఆలోచ‌న చిరుకు గానీ చ‌ర‌ణ్ కి గానీ లేద‌ని అస‌లు విష‌యం తెలిసి ఫ్యాన్స్ వాపోతున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.