Begin typing your search above and press return to search.

వీడియో: రకుల్ రచ్చ మాములుగా లేదుగా

By:  Tupaki Desk   |   26 April 2019 10:56 AM IST
వీడియో: రకుల్ రచ్చ మాములుగా లేదుగా
X
టాలీవుడ్ లో మొన్నటి దాకా అవకాశాలతో ఉక్కిరిబిక్కిరైన రకుల్ ప్రీత్ సింగ్ కన్ను ఇప్పుడు బాలీవుడ్ మీదే ఉంది . ఎలాగైనా అక్కడ సెటిలైపోవాలని చాలా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. గ్లామర్ షో విషయంలో మన దగ్గర మొహమాట పడింది కాని అక్కడ మాత్రం స్వేచ్చగా గేట్లు తీసేసింది. అజయ్ దేవగన్ తో నటించిన కొత్త సినిమా దే దే ప్యార్ దే వచ్చే నెల విడుదలకు రెడీ అవుతోంది.

ఇప్పటికే దీని తాలుకు వీడియో సాంగ్ ఒకటి హల్చల్ చేయగా తాజాగా మరొకటి కూడా వదిలారు. హాలి హాలి అంటూ సాగే ఈ కలర్ఫుల్ పాటలో అజయ్ దేవగన్ ఒకపక్క పడుచు బ్యూటీ రకుల్ తో మరోపక్క ముదురు భామ టబుతో ఏకకాలంలో డ్యూయెట్ పాడుతూ రొమాన్స్ చేయడం వెరైటీగా ఉంది. పాట సెట్టింగ్ షూట్ చేసిన విధానం అంత రొటీన్ గానే అనిపిస్తుంది కాని అసలు ఆకర్షణ రకులే.

ఒంపుసొంపుల్ని ఒలకబోసిన తీరు క్లీవేజ్ ని ఎక్స్ పోజ్ చేసిన విధానం అంతా హాట్ హాట్ గా ఉంది. సైజు జీరోకి మార్చుకున్న నడుమును పదే పదే హై లైట్ చేస్తున్న రకుల్ ఈ సినిమాలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోయినట్టు కనిపిస్తోంది. యాభై ఏళ్ళ వయసులో టీనేజ్ పిల్లలున్న ఓ వ్యక్తి ప్రేమలో పడే యువతీగా రకుల్ ప్రీత్ సింగ్ కాస్త డిఫరెంట్ రోలే చేస్తోంది. అతనితో విడాకులు తీసుకున్న భార్యగా టబు చేస్తోంది.

ఈ ఇద్దరి మద్య నలిగిపోయే పాత్రే అజయ్ దేవగన్ ది. మే 17 విడుదల కానున్న దేదే ప్యార్ దే రకుల్ గ్లామర్ షోనే మెయిన్ సెల్లింగ్ ఫ్యాక్టర్ గా మారింది. మరి దీంతో అయినా సాలిడ్ హిట్ కొట్టాలన్నా రకుల్ ఆశలు ఎంత వరకు నెరవేరుతాయో చూడాలి