Begin typing your search above and press return to search.
శెట్టి హతవిధి సాంగ్.. ధనూష్ మ్యాజిక్ చేశాడుగా..
By: Tupaki Desk | 31 May 2023 11:51 AM GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన టైమింగ్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. 'జాతిరత్నాలు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అతడు నటిస్తోన్న చిత్రమే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మహేష్‌బాబు పీ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబోలో వస్తున్న దీనిపై అంచనాలు ఉన్నాయి.
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి - స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తోన్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీని ప్రకటించిన తర్వాత దీని నుంచి పెద్దగా అప్‌డేట్లు రాలేదు. కానీ, ఈ మధ్య కాలంలో వరుసగా పోస్టర్లు, టీజర్, పాటలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి 'హతవిధి' అంటూ సాగే ఓ డిఫరెంట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' నుంచి తాజాగా వచ్చిన 'హతవిధి' పాటను రాధాన్ కంపోజ్ చేయగా.. రామజోగయ్య శాస్త్రి దీనికి లిరిక్స్ ఇచ్చారు. ఇక, ఈ పాటను కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్ ఆలపించాడు.
అతడు తనదైన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశాడు. దీంతో ఈ పాటకు అతడి స్టైలే హైలైట్ అయింది. దీనికితోడు ఇందులో డిఫరెంట్ ట్యూన్, ఫన్నీ విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీంతో ఈ పాట వైరల్ అవుతోంది.
హీరో కష్టాలను వివరిస్తూ డిజైన్ చేసిన 'హతవిధి' పాట విడుదలైన నేపథ్యంలో నవీన్ పోలిశెట్టి తన ట్విట్టర్ ఖాతాలో 'జానే జిగిరీస్ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' నుంచి హతవిధి సాంగ్ విడుదలైంది. ఈ మూవీలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ఇది చూసి మీ బెస్ట్ మూమెంట్ ఏంటో చెప్పండి. మన పాట వచ్చేసింది డార్లింగ్స్' అంటూ పోస్ట్ చేశాడు.
ఇదిలా ఉండగా.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి రాధాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో అభినవ్ గోమటం, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రం విడుదలపై ఇంకా ప్రకటన రాలేదు.