Begin typing your search above and press return to search.

హేట్ స్టోరీలో మిస్ ఇండియా హీటెక్కిస్తోంది

By:  Tupaki Desk   |   26 Jan 2018 10:14 AM GMT
హేట్ స్టోరీలో మిస్ ఇండియా హీటెక్కిస్తోంది
X
2015లో మిస్ ఇండియాగా టైటిల్ గెలుచుకుని మిస్ యూనివర్స్ పోటీలకు కూడా వెళ్లొచ్చిన భామ ఊర్వశి రౌతేలా. అంతకు ముందు సంవత్సరమే టైటిల్ గెలుచుకున్నా.. వయసు తేడా చెప్పినందుకు టైటిల్ పోగొట్టుకుంది. అయినా సరే మరుసటి ఏడాదే మళ్లీ పోటీ పడి విన్నర్ గా నిలిచిన అపురూప అందం ఊర్వశి సొంతం.

ఈ సుందరి ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలు చేసేస్తోంది. ఎక్కువగా స్పెషల్ అపియరెన్స్ లు.. అడపదడపా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ బాగానే నెట్టుకొట్టోంది. ఇప్పుడీ బ్యూటీ హేట్ స్టోరీ4 అనే అడల్ట్ కంటెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. రేపే ఈ సినిమా ట్రైలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసిన యూనిట్.. డిఫరెంట్ గా ఈ పోస్టర్ డిజైన్ చేసింది. వీ షేప్ లో బ్యాక్ ఓపెన్ రెడ్ కలర్ డ్రెస్ లో.. ఊర్వశిని బ్యాక్ నుంచి చూపిన విధానం అదిరిపోయింది.

ఇప్పటివరకూ హేట్ స్టోరీ సిరీస్ లో ఇప్పటివరకూ ఫ్రెష్ అందాలను పరిచయం చేశారు. మొదటి భాగంలో పావలి డామ్.. రెండో భాగంలో సుర్వీన్ చావ్లా.. మూడో పార్ట్ లో జరీన్ ఖాన్ తో తొలిసారిగా అందాలు ఆరబోయించారు. కానీ ఊర్వశి రౌతేలా మాత్రం రెండేళ్ల క్రితమే గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రంలో అందాలతో పాటు చాలానే చూపించింది. మరి ఇప్పుడు హేట్ స్టోరీ4లో ఏమేం చూపించబోతోందో చూడాలి.