Begin typing your search above and press return to search.

కండల వీరుడికి హ్యాట్రిక్ టెన్షన్

By:  Tupaki Desk   |   9 May 2019 4:18 AM GMT
కండల వీరుడికి హ్యాట్రిక్ టెన్షన్
X
వచ్చే నెల ఈద్ పండగ సందర్భంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న భారత్ విషయంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ టెన్షన్ పడుతున్నాడు. దానికి కారణం లేకపోలేదు. మూడేళ్ళ క్రితం వరకు రంజాన్ పండక్కు సల్మాన్ ది ఖచ్చితంగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ ఉండేది. దాన్ని బలపరుస్తూ బాడీ గార్డ్-సుల్తాన్-భజరంగి భాయ్ జాన్ లాంటివి వసూళ్ల రూపంలో రుజువు చేసేవి. దెబ్బకు ఇతర హీరోలు ఈ పండగ జోలికి వచ్చేవి కావు.

కానీ 2017లో ట్యూబ్ లైట్ 2018లో రిలీజైన రేస్ త్రి ఈ నమ్మకాన్ని దారుణంగా దెబ్బ కొట్టాయి. సల్లు భాయ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్స్ గా ఇవి పేరు తెచ్చుకున్నాయి. కనివిని ఎరుగని రీతిలో వీటి మీద ట్రాలింగ్ కూడా జరిగింది. కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో రాకపోవడం అభిమానులను నిరాశ పరిచింది

ఈ వరుసలో ఇప్పుడిది మూడో సినిమా. భారత్ ట్రైలర్ కు ఆడియో కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా 300 కోట్లకు పైగా దీని మీద బిజినెస్ ని ఆశిస్తున్నారు. టాక్ బాగుంటే పండగ బెనిఫిట్ తో పాటు సల్మాన్ ఇమేజ్ అంతకు రెట్టింపు కావాలన్నా ఇస్తుంది. కంటెంట్ లో తేడా ఉంటే మాత్రం ఈ మధ్య బాలీవుడ్ ప్రేక్షకులు మొహమాటం లేకుండా ఎంత పెద్ద స్టార్లు ఉన్నా సినిమాలను తిరస్కరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత్ కు ఇది పెను సవాలే. రకరకాల గెటప్పులతో సల్మాన్ లుక్ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. లక్కీ పెయిర్ కత్రినా కైఫ్ తో చేసిన సినిమా కాబట్టి సల్మాన్ ఫ్యాన్స్ ఆ యాంగిల్ లో నమ్మకం పెట్టుకున్నారు. చూడాలి ఎలాంటి ఫలితం దక్కుతుందో. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించడం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది