Begin typing your search above and press return to search.
హసీన్ దిల్ రూబా' ట్రైలర్: బెడ్ సీన్స్ - లిప్ లాక్స్ తో రెచ్చిపోయిన తాప్సీ
By: Tupaki Desk | 11 Jun 2021 4:46 PM ISTకెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలను ఎంచుకొంటూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ తాప్సీ పన్ను. ఇప్పుడు ''హసీన్ దిల్ రూబా'' అనే మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఇందులో విక్రాంత్ మాస్సే - హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలు పోషించారు. గతేడాది సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు థియేటర్లలో విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో నేరుగా ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో జులై 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ చేయబడిన టీజర్ మంచి స్పందన తెచ్చుకోగా.. తాజాగా ట్రైలర్ ను తాప్సీ విడుదల చేసింది.
ట్రైలర్ లో విక్రాంత్ మాస్సే ని పెళ్లి చేసుకున్న తాప్సీ.. హర్షవర్ధన్ రాణే తో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు చూపించారు. భర్త మరణానికి వేరో వ్యక్తితో ఎఫైర్ పెట్టున్న భార్య కారణమని పోలీసులు అనుమానించి ఆమెను విచారిస్తున్నట్లు చూపించారు. అదే సమయంలో ఆమె ప్రియుడు మిస్ అవడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు పురుషుల ప్రేమ మధ్య చిక్కుకున్న యువతిగా.. ఇద్దరు హీరోలతో తాప్సీ రొమాంటిక్ సన్నివేశాలు ట్రైలర్ ను ఆకర్షణీయంగా మార్చాయి.
పడక గది సన్నివేశాలు.. లిప్ లాక్ సీన్స్ లలో తాప్సీ హాట్ హాట్ గా కనిపించింది. మునుపెన్నడూ కనిపించనంత గ్లామరస్ గా కూడా ఉంది. ఇందులో బాంబు పేలుళ్లు.. ఛేజింగ్ సీన్లు ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందిన 'హసీన్ దిల్ రూబా' ట్రైలర్ కొత్తగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీనికి అమిత్ త్రివేది నేపథ్య సంగీతం ఆకట్టుంది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్ కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. వినీల్ మాథ్యూ దర్శకత్వం వహించారు. టీ సిరీస్ ఫిలిమ్స్ మరియు కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. తాప్సి కెరీర్లో నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న తొలి చిత్రం 'హసీన్ దిల్ రుబా' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.