Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ `హసీన్ దిల్ రుబా`

By:  Tupaki Desk   |   7 Jun 2021 12:00 PM IST
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ `హసీన్ దిల్ రుబా`
X
పెద్ద తెర‌పై సినిమాల్ని రిలీజ్ చేసే స‌న్నివేశం లేక‌పోవ‌డంతో అది టెలివిజ‌న్ రంగానికి డిజిట‌ల్ రంగానికి పెద్ద ఎత్తున క‌లిసొచ్చింది. ముఖ్యంగా ఓటీటీ రంగం ఒక్క‌సారిగా దేశంలో ఊపందుకునేందుకు ఇది పెద్ద ఊత‌మిచ్చింది. అయితే పరిశ్రమల‌ పునరుద్ధరణకు సహాయపడటానికి థియేట్రిక‌ల్ విడుదలల‌ను చేయాలని థియేటర్ యజమానులు చిత్రనిర్మాతలను కోరినప్పటికీ అది సాధ్య‌ప‌డ‌డం లేదు.

ఆ క్ర‌మంలోనే అమెజాన్ .. నెట్ ఫ్లిక్స్ లో ప‌లు క్రేజీ సినిమాలు రిలీజైపోతున్నాయి. ఇప్పుడు తాప్సీ ప‌న్ను న‌టించిన `హసీన్ దిల్ రుబా` యుఎస్ కి చెందిన‌ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో జూలై 2 న విడుద‌ల‌వుతోంది. మిస్టరీ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రానికి వినీల్ మాథ్యూ దర్శకత్వం వహించారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ పతాకంపై ఆనంద్ ఎల్. రాయ్ - హిమాన్షు శర్మ నిర్మించారు. ఇందులో విక్రాంత్ మాస్సే - హర్షవర్ధన్ రాణే త‌దిత‌రులు న‌టించారు.

పరిణీతి చోప్రా ది గర్ల్ ఆన్ ది ట్రైన్ సెకండ్ వేవ్ భారతదేశాన్ని తాకడానికి ముందే స్ట్రీమింగ్ మార్గానికి కట్టుబడి ఉంది. తాప్సీ న‌టించిన హ‌సీనా దిల్ రుబా కూడా ఓటీటీ రిలీజ్ ని ఉద్ధేశించి తెర‌కెక్కించిన‌దే.

హ‌సీనా దిల్ రుబా చిత్రానికి సుమారు 20 కోట్ల డీల్ కుద‌ర‌గా..రూ. 15 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెర‌కెక్కించారు. ప్రకటనల కోసం అదనంగా మ‌రో 8-10 కోట్లు ఖర్చు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని భావించి ఓటీటీకి ఇచ్చేశార‌ట‌. కార్తీక్ ఆర్యన్ ధమాకా ను కూడా నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేయ‌నుంది. ఫర్హాన్ అక్తర్ తూఫాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.