Begin typing your search above and press return to search.

గ్యాంగ్‌ లీడర్‌ కు ఉన్నంత సీన్‌ వీవీఆర్‌ కు ఉందా.?

By:  Tupaki Desk   |   29 Dec 2018 1:30 AM GMT
గ్యాంగ్‌ లీడర్‌ కు ఉన్నంత సీన్‌ వీవీఆర్‌ కు ఉందా.?
X
వినయ విధేయ రామ ఆడియో ఫంక్షన్‌ అద్భుతంగా జరిగింది. కార్యక్రమానికి వచ్చిన ప్రతీ గెస్ట్‌ అద్భుతంగా మాట్లాడారు. ఆహుతుల్ని ఆకట్టుకున్నారు. అయితే.. కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌… ఇద్దరూ కలిసి ఒక మాట అన్నారు. ఒక సినిమా ప్రస్తావన పదే పదే తెచ్చాు. అదే గ్యాంగ్‌ లీడర్‌. వినయ విధేయ రామ సినిమా గ్యాంగ్‌ లీడర్‌ లా ఉంటుందని.

మెగాస్టార్‌ కెరీర్‌ లో సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ గ్యాంగ్‌ లీడర్‌. విజయబాపినీడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఎక్కువ. తన కుటుంబ సభ్యులు జోలికి వచ్చిన ఎవ్వరినీ వదలని రాజారామ్‌ పాత్రలో మెగాస్టార్‌ ఇదరగీశాడు. అయితే.. గ్యాంగ్‌ లీడర్‌ సినిమా హిట్‌ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది పాటలు. మెగాస్టార్‌, బప్పీలహరి కాంబినేషన్‌ లో వచ్చిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్‌ హిట్టే. అందుకే.. ఈ సినిమాలోని వానా వానా వెల్లువాయే పాటని రచ్చసినిమాలో రీమిక్స్‌ చేసుకున్నాడు చరణ్‌. ఇక గ్యాంగ్‌ లీడర్‌ హిట్‌ కు రెండో కారణం మెగాస్టార్‌ పర్‌ ఫార్మెన్స్‌. ఇందులో చెయ్యి చూడు ఎంత రఫ్‌ గా ఉందో అనే డైలాగ్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది.

మెగాస్టార్‌ కు చాలా రఫ్‌ లుక్‌ తెచ్చిపెట్టింది. ముచ్చటగా మూడో రీజన్‌.. గ్యాంగ్‌ లీడర్‌ సినిమా ముందు మెగాస్టార్‌ కు సరైన హిట్‌ లేదు. స్టూవర్ట్‌ పురం పోలీస్‌ స్టేషన్‌, రాజా విక్రమార్క సినిమాలతో ఫ్లాపులు చవిచూశాడు. దీంతో… మంచి సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చెయ్యడం మొదలుపెట్టారు. అదే టైమ్‌ లో గ్యాంగ్‌ లీడర్‌ రిలీజ్‌ అయ్యింది. సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇక ఇప్పుడు వీవీఆర్‌ లో కూడా ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఉంది. సినిమా నిండా జనం ఉన్నారు. కానీ బప్పీలహరి లాంటి మ్యూజిక్‌ మ్యాజిక్‌ ఉందా అంటే డౌటే. దేవిశ్రీ పాటలు సోసోగా ఉన్నాయి. బోయపాటి రేంజ్‌ యాక్షన్‌ సీన్స్‌ అన్నీ గతంలోనే మనం చూసేశాం. ఇప్పుడు అంతకుమించి తీస్తేనే వీవీఆర్‌ అభిమానులకు కిక్ ఇస్తుంది. గ్యాంగ్ లీడర్‌ రేంజ్‌ లో హిట్‌ అవుతుంది. మరి వినయ విధేయ రామ గ్యాంగ్‌ లీడర్‌ రేంజ్‌ లో హిట్‌ అవుతందో లేదో తెలియాలంటే.. సంక్రాంతి వరకు ఆగాల్సిందే.