Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ అల్లుడు కాబోతున్నాడట!

By:  Tupaki Desk   |   31 Dec 2018 4:34 PM IST
హైదరాబాద్‌ అల్లుడు కాబోతున్నాడట!
X
తమిళ హీరో విశాల్‌ ప్రేమ, పెళ్లి విషయమై చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. వరలక్ష్మితో ప్రేమాయణం గురించి ఎన్నో సార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కాని ఇద్దరు కూడా పలు సార్లు తమ ప్రేమ విషయమై కొట్టి పారేశారు. ప్రేమ విషయమై పలు సార్లు వీరిద్దరు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా విశాల్‌ వివాహం గురించి మరో వార్త మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

త్వరలోనే విశాల్‌ ఒక హైదరాబాది అమ్మాయితో ఒక్కటి కాబోతున్నాడని, అనీషా అనే అమ్మాయిని విశాల్‌ వివాహం చేసుకోబోతున్నాడని, త్వరలోనే నిశ్చితార్థం కూడా జరుగబోతుంది అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళ మీడియాకు విశాల్‌ స్వయంగా జీకే రెడ్డి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే జీకే రెడ్డి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

గత మూడు నాలుగు సంవత్సరాలుగా విశాల్‌ తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. నడిగర్‌ సంఘం భవనం పూర్తి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నడిగర్‌ సంఘం బిల్డింగ్‌ పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో విశాల్‌ పెళ్లికి సిద్దమయినట్లుగా తెలుస్తోంది. 2019 చివరి వరకు విశాల్‌ వివాహం జరుగుతుందని తమిళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.