Begin typing your search above and press return to search.
వేలమందితో కర్ణుడి భీకర యుద్ధం
By: Tupaki Desk | 12 Feb 2019 1:02 PM ISTబాహుబలి సెట్ చేసిన బెంచ్ మార్క్ వల్ల దాన్ని స్థాయిలోనో లేదా మించిపోయేలా తమ భాషలోనూ ఓ సినిమా ఉండాలన్న తాపత్రయం అన్ని చోట్లా ఉంది. ఆ మధ్య విజయ్ పులితో గత ఏడాది అమీర్ ఖాన్ తగ్స్ అఫ్ హిందుస్థాన్ తో చేసింది ఇలాంటి ప్రయత్నాలే. అయితే అవి కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో బాహుబలి రికార్డ్స్ అన్ని అలాగే భద్రంగా ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నాలకు మాత్రం చెక్ పడలేదు.
తమిళ్ తో పాటు దేశవ్యాప్తంగా ముఖ్య భాషలు అన్నింటిలో రాబోతున్న మహావీర్ కర్ణ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. చియాన్ విక్రమ్ మొదటిసారి మహాభారత గాధలోని కర్ణుడి వేషం వేస్తున్నాడు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కు పోటీగా 300 కోట్ల బడ్జెట్ తో ఇది రూపొందుతోందని ఇప్పటికే తమిళ మీడియా ఓ రేంజ్ లో మోసేస్తోంది. యునైటెడ్ ఫిలిం కింగ్ డం నిర్మిస్తున్న ఈ మూవీ కోసం వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో యుద్ధ ఘట్టాలను షూట్ చేస్తున్నాడు దర్శకుడు ఆర్ ఎస్ విమల్. మొత్తం 18 రోజుల పాటు భీకరమైన ఈ యుద్ధ సన్నివేశాలని తీయబోతున్నారు. విక్రమ్ ను ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త రూపంలో ఇందులో చూడబోతున్నారని యూనిట్ తెగ ఊరిస్తోంది.
తెలుగులో ఎన్టీఆర్ గతంలో చేసిన దానవీర శూరకర్ణ సౌత్ లో కర్ణుడి మీద వచ్చిన బెస్ట్ మూవీగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడీ మహావీర్ కర్ణతో తిరగరాస్తాము అంటున్నారు నిర్మాతలు. అదలా ఉంచితే విక్రమ్ గత కొన్నేళ్లుగా సక్సెస్ లేక బాగా ఇబ్బంది పాడుతున్నడు. అతను మార్కెట్ స్థాయికి ఎన్నోరెట్లు ఎక్కువ బడ్జెట్ దీని మీద పెడుతున్నారు. ఏ మాత్రం అటుఇటు అయినా చాలా తేడాలు వచ్చేస్తాయి. దీని విడుదల ఆర్ ఆర్ ఆర్ లాగే వచ్చే ఏడాది ఉండబోతోంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగా ఉంటాయట. చూద్దాం