Begin typing your search above and press return to search.

బుల్లితెర పై విక్టరీ కొడతాడా ?

By:  Tupaki Desk   |   3 Jan 2019 5:32 AM GMT
బుల్లితెర పై విక్టరీ కొడతాడా ?
X
ఏ స్థాయిలో విజయం సాధించింది అనేది పక్కన పెడితే బిగ్ బాస్ షో తెలుగునాట ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన మాట నిజం. ప్రేక్షకులకు ఓ వినూత్న అనుభూతిని ఇవ్వడంలో సక్సెస్ అయ్యింది. అందుకే రేటింగ్స్ తో సంబంధం లేకుండా పబ్లిక్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు కాబట్టి స్టార్ మా ఛానల్ దీన్ని కొనసాగించేందుకు రెడీ అవుతోంది. కానీ వచ్చిన చిక్కల్లా యాంకర్. హిందీ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు సీజన్లకు కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించి రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ పాపులారిటీలో సల్లుని ఓవర్ టేక్ చేసేవాళ్ళు లేరు. తమిళ్ లో కూడా కమల్ హాసన్ ఒకే రోలో రెండు పూర్తి చేసాడు.

కానీ తెలుగుకు వచ్చేటప్పటికి సీన్ మారిపోతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ సక్సెస్ ఫుల్ గా నడిపించాక రెండో సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని తారక్ రేంజ్ లో కాదు కానీ ఓ మాదిరిగా బాగానే మెప్పించాడు. ఆర్మీ గోల సోషల్ మీడియా ట్రాలింగ్ కాస్త ఎక్కువైపోయి నానికి విసుగొచ్చిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు మూడో సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను చేయను అని నాని ముందే చెప్పేసాడు. తారక్ సినిమాలకే టైం లేదు ఇక టీవీ షోల గురించి ఆలోచించే సీన్ కూడా లేదు. సో బంతి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కోర్ట్ లో ఉన్నట్టు సమాచారం.

నాని హోస్ట్ గా ఉన్నప్పుడు ఫైనల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా వచ్చిన వెంకీ దీని మీద ఆసక్తిగానే ఉన్నారట. అయితే స్పాంటేనియస్ గా మాట్లాడాల్సిన ఇలాంటి షోలో ఇంగ్లీష్ ని ఎక్కువ మిక్స్ చేస్తూ తెలుగులో మాట్లాడే వెంకీ దీనికి ఎంత వరకు న్యాయం చేకూరుస్తాడు అనేది ఆలోచించాల్సిన విషయమే. చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం. వెంకీ ఒకవేళ ఓకే చేసినా టార్గెట్ చేయాల్సింది నానిని కాదు జూనియర్ ఎన్టీఆర్ ని. అదైతే అంత ఈజీ కాదు. నాగ్ చేసిన షోని చిరు అంతే సమర్ధవంతంగా నడిపించలేకపోయిన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి ఫైనల్ గా ఎవరు వస్తారు అనేది ఆసక్తికరమే