Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీ ని ఇలా ముంచేస్తున్నారేంటి?

By:  Tupaki Desk   |   9 Dec 2018 10:42 AM IST
మిల్కీ బ్యూటీ ని ఇలా ముంచేస్తున్నారేంటి?
X
‘బాహుబలి’ లాంటి మెగా బ్లాక్‌ బస్టర్లో తన అందంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది తమన్నా. ఈ చిత్రంతో ఆమె స్థాయి పెరిగిపోతుందని.. కెరీర్ మారిపోతుందని అంతా అనుకున్నారు. ఆశ్చర్యకరం గా ‘బాహుబలి’ తర్వాత తమన్నా కెరీర్ తిరోగమన దిశలో పయనించింది. పారితోషకం విషయంలో, పాత్రల విషయంలో కొండెక్కి కూర్చోవడం వల్లో ఏమో.. ఆమె కెరీర్ నెమ్మదించింది. దీని కి తోడు తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఫెయిలవవడంతో ఆమె మరింత వెనుకబడిపోయింది.

ఈ మధ్య తమన్నా ఎంతో ప్రేమించి.. కష్టపడి చేస్తున్న సినిమాలు కూడా ఆమె కు తీవ్ర నిరాశను మిగిలుస్తున్నాయి. దర్శకులు ఏం చెప్పి ఒప్పిస్తున్నారో కానీ.. తమన్నా పాత్రల ఎంపికలో బ్లండర్స్ చేస్తోంది. ఆ సినిమాల కోసం ఆమె పడుతున్న కష్టమంతా వృథా అయిపోతోంది. రెండేళ్ల కిందట మిల్కీ బ్యూటీ ‘అభినేత్రి’ అనే సినిమా చేసింది. నటన పరంగా కష్టపడటమే కాక.. అందాలూ ఆరబోసింది. కానీ ఆమె కష్టం ఫలించలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఐతే అదైనా పర్వాలేదు కానీ.. ఈ ఏడాది ఆమె చేసిన ‘నా నువ్వే’ పరిస్థితి దారుణం. తమన్నా ఈ సినిమా గురించి ఎంతో చెప్పింది. దర్శకుడు జయేంద్ర గొప్ప అభిరుచి ఉన్నాడని.. తన కెరీర్లో నిలిచపోయే పాత్ర ఇచ్చాడని.. ఈ సినిమా తన కు చాలా పేరు తెస్తుందని అంది. తన వరకు ఆ సినిమా లో సిన్సియర్ ఎఫర్ట్ పెట్టింది. చాలా గ్లామరస్‌ గా కనిపించింది. కానీ ఏం లాభం.. సినిమా దారుణమైన ఫలితాన్నందుకుంది.

తాజా గా ‘నెక్స్ట్ ఏంటి’ సినిమాలో నూ అంతే. దీని కోసం లుక్ మార్చుకుంది. రిఫ్రెషింగ్‌ గా కనిపించింది. గ్లామర్ షో చేసింది. నటన పరంగా నూ ఆకట్టుకుంది. కానీ ఇది కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. సినిమా చూసిన వాళ్లంతా తమన్నాను పొగిడి.. సినిమా ను తిట్టిపోస్తున్నారు. పాపం తమన్నా అని జాలిపడుతున్నారు. ఇలాంటి సినిమాల కోసం ఆమె ఇంత కష్టపడటం.. ఇంతగా అందాల ప్రదర్శన చేయడం ఎందుకని అంటున్నారు. తన స్థాయికి తగని హీరోల పక్కన నటిస్తూ సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్న తమన్నాకు ఈ షాకు లు రుచించడం లేదు. వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలతో ఆమె కెరీర్ దాదాపుగా ముగింపు దశకు వచ్చేసినట్లు కనిపిస్తోంది