Begin typing your search above and press return to search.

పాత ఏడాది కన్పించలేదు. కొత్త ఏడాదిలో ఏం చేస్తారు..?

By:  Tupaki Desk   |   1 Jan 2019 7:15 AM GMT
పాత ఏడాది కన్పించలేదు. కొత్త ఏడాదిలో ఏం చేస్తారు..?
X
పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదికి తెలుగువారంతా ఘన స్వాగతం పలికారు. కొత్త ఏడాది కూడా తెలుగు ఇండస్ట్రీ 3 హిట్లు, 6 సూపర్‌ హిట్స్‌ తో దూసుకుపోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే.. ఎంత మంది ఉన్నా ఈ ఏడాది మాత్రం అందరి చూపు మెగాస్టార్‌ చిరంజీవి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పైనే. ఎందుకంటే.. వీరిద్దరూ లాస్ట్ ఇయర్‌ మిస్సింగ్‌.

ఖైదీ నెంబర్‌ 150 సూపర్‌ హిట్‌ తర్వాత సైరా మూవీ చేస్తున్నాడు మెగాస్టార్‌. ఈ సైరా మూవీ ప్రీ ప్రొడక్షన్‌ కోసం ఎక్కువ టైమ్‌ కేటాయించడం వల్ల లాస్ట్ ఇయర్‌ సినిమా పూర్తవ్వలేదు. దీంతో.. మెగాస్టార్‌‌ సినిమా లేకుండానే 2018 వెళ్లిపోయింది. ఇప్పుడు 2019లో సైరా సినిమాతో తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి.

ఇక బాహుబలి సిరీస్‌ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని సాహో మూవీ స్టార్ట్‌ చేశాడు ప్రభాస్‌. ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా అయిపోవచ్చింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కాబోతుంది. సాహో సినిమాతో మరో ఇండస్ట్రీ బ్లాక్‌ బస్టర్‌ పై కన్నేశాడు ప్రభాస్‌. మరి గతేడాది కన్పించని మెగాస్టార్‌, ప్రభాస్‌.. ఈ ఏడాదిలో హిట్స్‌ ఇస్తారో లేదో వెయిట్‌ అండ్‌ సీ.