Begin typing your search above and press return to search.

సామ్ ముసలమ్మ అయితే.. రవితేజ ముసలయ్య!

By:  Tupaki Desk   |   27 Jan 2019 9:45 AM GMT
సామ్ ముసలమ్మ అయితే.. రవితేజ ముసలయ్య!
X
ఇతర భాషా చిత్రాలను ప్రేరణగా తీసుకొని సినిమాల తెరకెక్కించడం టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉంది. మన సినిమాలలో చాలావాటి మూలాలు హాలీవుడ్ సినిమాలే కాకుండా కొరియన్ సినిమాల్లో కూడా ఉంటాయాని ప్రూఫులు కూడా చూపిస్తుంటారు కొందరు నెటిజనులు. అ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుందా అన్నట్టుగా ప్రస్తుతం తెలుగు లో రెండు సినిమాలు ఒక కొరియన్ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంతా 'బేబీ' అని అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా 'మిస్ గ్రానీ' అనే కొరియన్ సినిమాకు రీమేక్ అని కొందరు అంటున్నారు. అఫీషియల్ రీమేకా లేదా జస్ట్ ఇన్స్పిరేషనా అనే విషయంపై క్లారిటీ లేదు గానీ 'మిస్ గ్రానీ' లో లాగే ఈ సినిమాలో కూడా ఒక ముదుసలి మహిళ అందమైన యువతి శరీరంలో ఉండడం అనేది కాన్సెప్ట్. ఇదిలా ఉంటే రవితేజ-వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కనున 'డిస్కోరాజా' సినిమాలో రవితేజ ఒక ముసలివాడుగా కన్పిస్తాడట. ఆ ముసలి వ్యక్తి అదృశ్యమై కుర్రవాడిగా తిరిగొచ్చి శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ సినిమా కాన్సెప్ట్ అని సమాచారం.

రెండూ సినిమాల్లో కామన్ పాయింట్ 'కుర్ర బాడీలో ముసలి మనిషి ఉండడం'. మిగతా స్టొరీ డ్రైవ్ వేరుగా ఉన్నప్పటికీ ఈ పాయింట్ మాత్రం మిస్ గ్రానీ నుండి తీసుకున్నదేనని అంటున్నారు. ఒకేసారి రెండు తెలుగు సినిమాలు ఒకే సినిమా ఆధారంగా తీసుకొని తెరకెక్కుతుండడం మాత్రం విశేషమే. ఈ సినిమాలు రిలీజ్ అయితే గానీ ఒరిజినల్ సినిమాకు ఈ సినిమాలకు ఎలాంటి పోలికలు ఉన్నాయో మనకు తెలిసే అవకాశం లేదు.