Begin typing your search above and press return to search.

ఈగో హర్ట్ చేస్తే వర్మ ఉరుకుంటాడా?

By:  Tupaki Desk   |   1 Feb 2019 10:04 AM GMT
ఈగో హర్ట్ చేస్తే వర్మ ఉరుకుంటాడా?
X
ఎన్నికల ముందు ఎప్పుడు హడావుడి చేసే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ గత కొన్ని రోజులుగా మీడియా ముందు తెగ గొంతు చించుకుంటున్నాడు. ఏపీలో ప్రజాశాంతి పార్టీకి అధికారం కట్టబెడితే ఏపీని అయిదు సంవత్సరాల్లో అమెరికాగా మార్చేస్తానంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్న పాల్‌ తన గొప్ప చెప్పుకునే సమయంలో వర్మపై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. వర్మ తన కాళ్లు పట్టుకున్నాడంటూ కేఏపాల్‌ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. పాల్‌ కాళ్లు పట్టుకున్న విషయం పై వర్మ తనదైన శైలిలో స్పందించాడు.

పాల్‌ తల సరి చేసేందుకు కాళ్లు పట్టుకుని లాగాలని భావించి కాళ్లు పట్టుకున్నట్లుగా ఎటకారం చేశాడు. ఆ తర్వాత తన ట్విట్టర్‌ వాల్‌ పై కేఏ పాల్‌ పై ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నాడు. పాల్‌ ఆమద్య పాడిన ఒక పాటను పోస్ట్‌ చేసి అందరిని నవ్వించాడు. పాల్‌ పై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ, పాల్‌ ను ఒక జోకర్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్న వర్మ తాజాగా ఆయన బయోపిక్‌ ను తీసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

తనను మామూలుగా కామెంట్‌ చేస్తేనే వర్మ ఊరుకోడు. ఇక వర్మ ఇగోను పాల్‌ హర్ట్‌ చేశాడు. తన ఈగోను హర్ట్‌ చేసిన పాల్‌ ను వర్మ ఊరికే వదిలేస్తాడా, ఖచ్చితంగా డబుల్‌ రివేంజ్‌ తీర్చుకుంటాడు. పాల్‌ ను జోకర్‌ గా చూపిస్తూ వర్మ సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి సినిమా కాని లేదంటే తన సినిమాలోని ఏదైనా కామెడీ పాత్రను పాల్‌ లా చూపించడం చేయడం ఖాయం. త్వరలోనే పాల్‌ కు స్వీట్‌ షాక్‌ తప్పదని వర్మ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. ఆ షాక్‌ ఎలా ఉంటుందో చూడాలి.