Begin typing your search above and press return to search.

రేణూ దేశాయ్‌ ఇంటర్వ్యూ వెనుక పవన్‌ కల్యాణ్‌

By:  Tupaki Desk   |   2 Jan 2019 4:06 PM IST
రేణూ దేశాయ్‌ ఇంటర్వ్యూ వెనుక పవన్‌ కల్యాణ్‌
X
తెలుగు ప్రజలంతా పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే పనిలో బిజీగా ఉన్నారు. కానీ తెలుగు చానెల్స్‌ మాత్రం పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ ఇంటర్వ్యూ ప్రసారం చేయడానికి పోటీ పడ్డాయి. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిలైన చాలారోజుల తర్వాత రేణూ దేశాయ్‌.. మీడియా ముందుకు వచ్చారు. అయితే ఆమె వచ్చిన రీజన్‌ వేరే. ఆమె రాసిన 'లవ్‌ అన్‌ కండిషనల్లీ' అనే కవితా సంకలనం ప్రమోషన్‌ కోసం హైదారాబాద్‌ వచ్చింది. ఈ కవితలన్నీ ఇంగ్లిషులో రాసింది రేణు. వీటిని తెలుగులో గీత రచయిత అనంత శ్రీరామ్‌ అనువాదం చేశాడు.

'లవ్‌ అన్‌ కండిషనల్లీ' కవితా సంకలనం ప్రమోషన్‌ కోసం వచ్చిన రేణు దేశాయ్‌ కు.. టీవీ ఛానెల్స్‌ సాదర స్వాగతం పలికాయి. దాదాపుగా అందరూ ఇంటర్వ్యూ చేశారు. పుస్తకం గురించి అడుగుతూనే పవన్‌ కల్యాణ్‌, జనసేన గురించి కూడా మొత్తం అడిగేశారు. ఆమె కూడా చాలా ఓపిగ్గా అందరికి సమాధానం చెప్పింది. అయితే.. ఈ ఇంటర్వ్యూల వెనుక పవన్‌ హస్తం ఉందనే టాక్‌ ప్రస్తుతం విన్పిస్తోంది. దానికి కారణం.. రేణు ఇంటర్వ్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఛానెల్‌ గా చెప్తున్న టీవీ99లో ప్రసారం కావడమే. రేణుని, అలాగా ఆమె పుస్తకాన్ని ప్రమోట్‌ చేయాల్సిందిగా పవన్‌ ఆర్డర్‌ వేశారట. దీంతో.. పవన్‌ టీమ్‌ రంగంలోకి దిగి ఇంటర్వ్యూ చేసిందని కామెంట్స్‌ విన్పిస్తున్నాయి.

అయితే.. ఈ కామెంట్స్‌ ను పవన్‌ టీమ్‌ కొట్టిపారేసింది. ఇంటర్వ్యూలు, ప్రమోషన్‌ వెనుకు పవన్‌ కల్యాణ్‌ లేడని తేల్చిచెప్పింది. పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య కావడంతో.. ఆటోమేటిగ్గా ఆమె ఇంటర్వ్యూల పై అందరికి ఆసక్తి ఉంటుందని చెప్పింది. పవన్‌ కల్యాణ్‌, అకిరా గురించి రేణు దేశాయ్‌ ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని అందరికి ఉంటుందని… అందుకే టీవీ చానెల్స్‌ ఆమెతో ఇంటర్వ్యూ చేసేందుకు పోటీ పడ్డాయని పేర్కొంది. సో.. కారణాలు ఏవైతేనేం.. మొత్తానికి పుస్తకం పుణ్యామా అని రేణుదేశాయ్‌ కు, ఆమె రాసిన పుస్తకానికి అద్భుతమైన కవరేజి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.