Begin typing your search above and press return to search.

రూమర్స్ అనుకోవాలా... లేక 'నిజం'గా నమ్మాలా?

By:  Tupaki Desk   |   26 Feb 2019 10:15 AM GMT
రూమర్స్ అనుకోవాలా... లేక నిజంగా నమ్మాలా?
X
సహజంగా ఒక పెద్ద హీరో సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఉంది అంటే... రకరకాల రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి... పలానా హీరో ఈ సినిమాలో ఉన్నాడు అని, పలానా హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తుంది... అని, ఆ నటుడు ప్రముఖ పాత్ర చేస్తున్నాడు అని... ఇలా అన్న మాట... ముఖ్యంగా అందులోకుటుంబాల విషయానికి వస్తే.... ఆ కుటుంభానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని, ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు అని రూమర్స్ తెగ చక్కెర్లు కొడుతూ ఉంటాయి.. అయితే వాటిల్లో మనకు నిజం ఎంతో... అబద్దం ఎంతో తెలియక పోయినా ఇట్టే నమ్మేస్తూ ఉంటాం.... అంతెందుకు ఒక పక్క బాలయ్య.... ఎన్టీఆర్ ఇద్దరూ ఎడముఖం... పెడముఖంగా ఉన్నా కూడా... ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో జూనియర్ పాత్ర ఇదే అంటూ... మసాలాతో కూడైన వార్తలు చాలానే వచ్చాయి.

ఇక ఈ క్రమంలో నమ్మిన వారు వాటిని నమ్మారు.. నమ్మని వారు... ఇవన్నీ మామూలే అంటూ కొట్టి పారేశారు... ఇక సినిమా చూశాక అందరూ చల్లబడ్డారు... ఇప్పుడు సైరా సినిమా విషయంలో కూడా అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి... ముఖ్యంగా మొన్నటి వరకూ ఇందులో చెర్రీ ఒక పాత్ర చేస్తున్నాడు అని చెప్పగా... మరో పక్క అల్లు అర్జున్ సైతం చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు అని వార్తలు వినిపించాయి... ఇక అవన్నీ రూమర్స్ అంటూ చక్కెర్లు కొడుతూ ఉన్న క్రమంలో తాజాగా మరో న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చక్కెర్లు కొడుతుంది... అదే మెగా డాటర్ నిహారిక కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది అని...

అయితే ఈ పాత్రకు సంభందించి వివరాల్లోకి వెళితే, ఈ పాత్ర ఒక గిరిజన మహిళ పాత్ర అని, ఆపద సమయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఆశ్రయం కల్పించే ఓ గిరిజన మహిళగా ఆమె కనిపించనుంది అని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ పాత్ర చాలా చిన్న పాత్ర అని, అయినా చాలా ప్రాముఖ్యత కలిసిన పాత్రగా దీన్ని తెరకెక్కిస్తున్నారు అని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి... మరి ఇది నిజమో, లేక కల్పితమో అనేది కొణిదెల ప్రొడక్షన్స్ అఫీషియల్ గా చెబితే గాని నమ్మలేము... ఎందుకంటే ఇలాంటి రూమర్స్ సర్వ సాధారణమే... మరి ఈ రూమర్స్ లో నిజం ఎంతో తెలియాలి అంటే మాత్రం కొన్నాళ్ళు ఆగాల్సిందే.!