Begin typing your search above and press return to search.

లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్ 3 అనొచ్చా

By:  Tupaki Desk   |   22 Feb 2019 4:38 PM GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్ 3 అనొచ్చా
X
ఎవరు ఏ ఉద్దేశాలతో మొదలుపెట్టినా ఎన్టీఆర్ పేరు మీద మొదలుపెట్టిన సినిమాల జాతర ఇవాళ్టితో రెండో రౌండ్ పూర్తి చేసుకుంది. కథానాయకుడు డిజాస్టర్ తర్వాత మహానాయకుడు మీద భారీ ఆశలు లేకపోయినా అభిమానులు చూద్దాంలే అని ఎదురుచూసారు. అయితే వస్తున్న రిపోర్ట్స్ వాటికి భిన్నంగా ఉండటం షాక్ కలిగించే విషయమైనా ఇంకో రెండు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అయితే కాకతాళీయంగా జరుగుతున్న బయోపిక్ ల నిర్మాణం చూస్తుంటే కొంత ఆశ్చర్యం కలగక మానదు. కథానాయకుడు ఎన్టీఆర్ సినిమా జీవితం ఎక్కడ ఎవరితో ఎలా మొదలైందో చూపిస్తూ ఆయన స్టార్ గా ఎదగడం తర్వాత టిడిపి పార్టీని ప్రకటించడంతో ముగుస్తుంది.

మహానాయకుడు అక్కడి నుంచి అందుకుని రెండు సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో ఎన్ని సాధక బాధలు పడ్డారో ఎవరు పక్కనే ఉండి ద్రోహం చేసారో అన్ని డిటైల్డ్ గా కవర్ చేసారు. అయితే ఇది బసవతారకం కన్నుమూసి ఎన్టీఆర్ రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ముగుస్తుంది. తర్వాత ఆయన ఊపిరి ఆగిపోయే దాకా జరిగిన అతి కీలకమైన పరిణామాలు ఏవీ కవర్ చేయలేదు.

వర్మ దీన్నే అవకాశంగా వాడుకుంటున్నాడు. ఎన్టీఆర్ తర్వాత లక్ష్మి పార్వతితో పరిచయం పెంచుకోవడం రెండో పెళ్ళికి సిద్ధపడటం ఇంట్లో అసమ్మతి బాబు వైస్రాయ్ హోటల్ రాజకీయాలు ఇవన్నీ చూపిస్తాను అంటూ మొదటి నుంచి ఊరిస్తూనే ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్ లో సైతం ఇదే హై లైట్ చేస్తున్నాడు. సిరీస్ ప్రకారం చూసుకుంటే కథానాయకుడు మహానాయకుడు తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ ఖచ్చితంగా మూడో భాగం కిందకే వస్తుంది.

కథలు కూడా అదే ఫ్లోలో సాగుతాయి. ఇది నందమూరి అభిమానులు ఒప్పుకోరు. కానీ చరిత్రలో నిక్షిప్తమైన ఎన్టీఆర్ తాలూకు నిజాలు ఓ వరసలో పేర్చుకుంటూ చూసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ కొనసాగింపుగానే కనిపిస్తుంది. ఇప్పుడీ పాయింట్ ని వర్మ ఎలాగూ వాడుకుంటాడు. అదే స్టైల్ లో చేస్తాడో వేచి చూడాలి