Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ ల‌ని భ‌రించ‌డం క‌ష్టంగా మారిందా?

By:  Tupaki Desk   |   1 Feb 2022 7:30 AM GMT
స్టార్ హీరోయిన్ ల‌ని భ‌రించ‌డం క‌ష్టంగా మారిందా?
X
టాలీవుడ్ లో గ‌త‌కొంత కాలంగా హీరోయిన్ ల కొర‌త కొన‌సాగుతోంది. సీనియ‌ర్ హీరోల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఏ సినిమా అయినా అంగీక‌రించారంటే వారి ప‌క్క‌న న‌టించే హీరోయిన్ ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారుతోంది. కొంత మంది హీరోల సినిమాల రెగ్యుల‌ర్ షూటింగ్ లు హీరోయిన్ లు ఫైన‌ల్ కాక‌పోవ‌డం వ‌ల్లే ఆల‌స్యం అవుతున్న సంద‌ర్భాలు చాలానే వున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోల చిత్రాలు హీరోయిన్ లు ఫైన‌ల్ కాక‌పోవ‌డం వ‌ల్లే ఆల‌స్య‌మైన విష‌యం తెలిసిందే.

దీంతో వున్న వారితో సర్దుకోవాల్సిన ప‌రిస్థితి. దీంతో అందుబాటులో వున్న హీరోయిన్ లు భారీగా డిమాండ్ చేస్తున్నారు. విధి లేక నిర్మాత‌లు వాళ్లు డిమాండ్ చేసినంత ఇవ్వ‌డానికి రెడీ అయిపోతున్నారు. స్టార్ హీరో ప‌క్క‌న స్టార్ హీరోయిన్ వుంటేనే ఆ మూవీకి క్రేజ్ దాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాత‌లు స్టార్ హీరోయిన్ ల కోసం ఎంత వ‌ర‌కు వెళ్ల‌డానికైనా రెడీ అవుతున్నారు. దీన్ని ఆస‌రాగా చేసుకుంటున్న స్టార్ హీరోయిన్ లు అందినంత వ‌సూలు చేసుకోవాల్సిందే అన్న‌ట్టుగా భారీ స్థాయిలో డిమాండ్ చేయ‌డం మొద‌లుపెట్టారు.

ఇప్పుడు స్టార్ హీరోయిన్ ల‌ని భ‌రించ‌డం నిర్మాత‌ల‌కు భారంగా మారుతోంది. డిమాండ్ వుందిక‌దా అని భారీగా వ‌సూలు చేస్తుండ‌టంతో వారిని భ‌రించ‌డం ఇప్పుడు క‌ష్టంగా మారింది. స‌మంత‌, అనుష్క‌, త‌మ‌న్నా, పూజా హెగ్డే, ర‌ష్మిక‌, కాజ‌ల్‌, సాయి ప‌ల్ల‌వి ఇప్పుడు మ‌న‌కున్న స్టార్ హీరోయిన్ లు. ఇందులో ఒక్కొక్క హీరోయిన్ కు వారి డిమాండ్ ని బ‌ట్టి 2 కోట్ల నుంచి 4 కోట్ల వ‌ర‌కు ఇవ్వాల్సి వ‌స్తోంది. స్టార్ హీరో కాంబినేష‌న్ ని బ‌ట్టి కూడా హీరోయిన్ లు పారితోషికం డిమాండ్ చేస్తుండ‌టం నిర్మాత‌ల పాలిట శాపంగా మారుతోంది.

అంతే కాకుండా వారి టీమ్ కు కూడా ప్ర‌త్యేకంగా ఖ‌ర్చు చేయాల్సి రావ‌డం ఇప్పుడు నిర్మాత‌ల‌కు పెను భారంగా మారుతోంది. హీరోయిన్ లు డిమాండ్ చేసినంత ఇవ్వ‌డానికి నిర్మాత‌లు రెడీ అవుతున్నా వారి సిబ్బందికి కూడా భారీగా ఖ‌ర్చు చేయాల్సి రావ‌డమే ఇప్పుడు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. `బాహుబ‌లి`లో ముందు శివ‌గామి పాత్ర‌కు రాజ‌మౌళి శ్రీ‌దేవిని అనుకున్న విష‌యం తెలిసిందే .అయితే శ్రీ‌దేవి రెమ్యున‌రేష‌న్ తో పాటు ఆమెకు సంబంధించిన 16 మంది సిబ్బందికి ఖ‌ర్చు చేయ‌డం ఇష్టం లేకే చివ‌రి నిమిషంలో శ్రీ‌దేవిని కాద‌ని ర‌మ్య‌కృష్ణ‌ని ఆ పాత్ర‌కు రాజ‌మౌళి ఎంచుకోవాల్సి వ‌చ్చింది. అదే సినిమాకు ప్ల‌స్ అయింది కూడా.

ఇదే త‌ర‌మాలో మ‌న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు కూడా త‌మ వెంట 10 నుంచి 12 మంది సిబ్బందిని తీసుకొస్తున్నార‌ట‌. మేక‌ప్ కి ఇద్ద‌రు, హెయిర్ స్టైల్ కి ఇద్ద‌రు, కాస్ట్యూమ్స్ కి ఇద్ద‌రు, వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలు చూసుకోవ‌డానికి ఇద్ద‌రు.. అంతే కాకుండా వ్య‌క్తిగ‌త అంగ‌ర‌క్ష‌కులు వీళ్లంతా క‌లిసి మొత్తం 12 నుంచి 15 మంది వ‌ర‌కు అవుతున్నార‌ట‌. వీరికి ట్రావెలింగ్ ఛార్జీల‌తో పాటు వీళ్ల రోజు వారి బ‌త్తాలు, భోజ‌నాలు, హోట‌ల్ రూమ్ ఖ‌ర్చులతో నిర్మాత జేబుకు చిల్లుప‌డుతోందట‌.

ఓ స్టార్ హీరోయిన్ వ్య‌క్త‌గ‌త సిబ్బంది ఖ‌ర్చు రోజు ఒక ల‌క్ష ల‌వుతోంద‌ట ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గ‌తంలో హీరోయిన్ కి రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డం, ఓ క్యార్ వాన్ ఏర్పాటు చేస్తే స‌రిపోయేది కానీ ఇప్పుడు అలా కాదు... త‌న రెమ్యున‌రేష‌న్ తో పాటు మిగ‌తా ఖ‌ర్చులు, 15 మంది సిబ్బంది ఖ‌ర్చు కూడా నిర్మాతే భ‌రించాలంటే త‌డిసిమోపెడ‌వుతోంద‌ని వాపోతున్నారు. ఇక ఓ స్టార్ హీరోయిన్ రోజు భోజ‌నం ఖ‌ర్చే 15 వేలు అంటే ఎవ‌రూ న‌మ్మ‌రు కానీ ఇది అక్ష‌రాలా నిజం. ఇదీ కాకుండా సెట్ కు స్టార్ హీరోయిన్ బౌన్స‌ర్ ల‌ని తీసుకురావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సెట్‌లో బౌన్స‌ర్ ల అవ‌సం ఏంటీ? అని చాలా మంది నిర్మాత‌లు వాపోతున్నారు. వారి ఖ‌ర్చులు కూడా నిర్మాత భ‌రించాల్సిందేనట‌.

దీంతో స్టార్ హీరోయిన్ అంటే నిర్మాత క‌ల‌లో ఉలిక్కిప‌డే ప‌రిస్థితులు ఇప్ప‌డు టాలీవుడ్ లో ఎదుర‌వుతున్నాయ‌ని చెబుతున్నారు. హీరో డిమాండ్ చేశాడుక‌దా అని కోరిన హీరోయిన్ ని పెట్టుకుంటే వారు చేస్తున్న నిర్వాకం ఇద‌ని కొంద మంది నిర్మాత‌లు వాపోతున్నారు. మ‌రి కొంద‌లైతే రెమ్యున‌రేష‌న్ ఇంతిస్తాను. మిగ‌తా ఖ‌ర్చుల గురించి నాకు సంబంధం లేద‌ని ఖ‌చ్చితంగా చెప్పేస్తే ఇలాంటి ఇబ్బందులు, అన‌వ‌ర‌స ఖ‌ర్చులు వుండ‌వు క‌దా అని మ‌రి కొంత మంది నిర్మాత‌లు అంటున్నారు.