Begin typing your search above and press return to search.

వెంకీ, వరుణ్‌ రాసుకుంటున్నారు, హిట్‌ వస్తుందా..?

By:  Tupaki Desk   |   26 Dec 2018 1:30 AM GMT
వెంకీ, వరుణ్‌ రాసుకుంటున్నారు, హిట్‌ వస్తుందా..?
X
ఎఫ్‌2 సినిమాతో.. అదేనండి ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ మూవీతో వీ2 హీరోలు ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీ2 అంటే మరెవరో కాదు విక్టరీ వెంకటేశ్‌- వరుణ్‌ తేజ్‌. ఇప్పుడు వీరిద్దరికి హిట్స్‌ కావాలి. ఫిదా- తొలిప్రేమ సినిమాతో హిట్స్‌ అందుకున్న వరుణ్‌ తేజ్‌.. అంతరిక్షంతో బాగా నిరాశపర్చాడు. ఇప్పుడు అర్జెంట్‌ గా వరుణ్‌ కి హిట్‌ రాకపోతే.. యూత్‌ ఆడియన్స్‌ మరీ ముఖ్యంగా అమ్మాయిలు దూరమయ్యే ఛాన్స్‌ ఉంది. అందుకే.. సంక్రాంతికి రిలీజ్‌ కాబోతున్న ఎఫ్‌ 2 పైనే ఆశలు పెట్టుకున్నాడు. వెంకటేశ్‌ తన సీన్స్‌ అన్నీ సూపర్‌ హిట్‌ అయ్యి ఆయనకున్నంత లేడీ ఫ్యాన్స్‌ తనకూ వస్తారని ఆశపడుతున్నాడు.

ఇక వెంకటేశ్‌ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. వయసుకు తగ్గట్లు సినిమాలు తీసుకుంటున్నా.. గతంలో ఉన్నంత క్రేజ్‌ అయితే వెంకటేశ్‌ కు ప్రస్తుతం లేదు. గురు తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని మరి ఈ ఎఫ్‌2 సినిమాలో నటించాడు. ట్రైలర్‌ ప్లస్‌ కాంబినేషన్‌ ఆసక్తిగానే ఉంది. అదిగాక అనీల్ రావిపూడి నాన్‌స్టాప్‌ గా హిట్స్‌ ఇస్తున్నాడు. అన్నింటికి మించి సంక్రాంతికి వచ్చిన కామెడీ ఎంటర్‌ టైనర్స్‌ అన్ని సూపర్‌ హిట్‌ అయ్యాయి. మరి జోగీ జోగీ రాసుకుంటే అదేదో రాలిందని.. వెంకీ- వరుణ్‌ రాసుకుంటున్న ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందో లేదో వెయిట్‌ అండ్‌ సీ.