Begin typing your search above and press return to search.

ఆ షోకి బాసా - ఛాన్సే లేదు

By:  Tupaki Desk   |   5 Jan 2019 6:52 AM GMT
ఆ షోకి బాసా - ఛాన్సే లేదు
X
బిగ్ బాస్ తెలుగు రెండు సీజన్లు పూర్తయ్యాక నెక్స్ట్ యాంకర్ గా ఎవరుంటారు అనే దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నాని చేయను అని ముందే చెప్పేసాడు కాబట్టి స్టార్ ఛానల్ మళ్ళి వేట మొదలుపెట్టింది. విక్టరీ వెంకటేష్ చాలా పాజిటివ్ గా ఉన్నారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. ఓకే చెప్పారా లేదా అనే క్లారిటీ లేదు కాని చర్చలు జరుగుతున్న మాట వాస్తవం. ఇదిలా ఉండగానే తాజాగా మెగాస్టార్ పేరు ఓ మీడియా వర్గంలో తెరమీదకు రావడంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాని ప్రకారం చిరంజీవితో సైతం స్టార్ మా టచ్ లో ఉందట.

బిగ్ బాస్ 3కి హోస్ట్ గా వ్యవహరించేందుకు ఆయన్ని ఒప్పించేలా మాట్లడుతున్నారని సదరు వార్త సారాంశం. కాని వాస్తవానికి సైరాతో పాటు కొరటాల శివ త్రివిక్రమ్ సినిమాలకు కమిట్ అయిన చిరు టీవీ షోలు చేసేంత టైంలో లేరు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు చేసినా అది ఖైది నెంబర్ 150 విడుదలకు ముందు. ఆ షో వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. తనను పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే టెస్ట్ చేసుకోవడానికి ఆయన దాన్ని వేదికగా మార్చుకున్నారు.

కాని 150 మూవీకి వంద కోట్ల వసూళ్లు వచ్చాక తనను బుల్లితెరపై కంటే సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకే అభిమానులు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని గుర్తించిన చిరు వరస సినిమాలతో బిజీ అయిపోయారు. సో ఎలా చూసుకున్నా సమ్మర్ లోపే స్టార్ట్ కావాల్సిన బిగ్ బాస్ 3 కి మెగాస్టార్ యాంకరింగ్ జరగని పనే. అభిమానులు సైతం చిరు ఇలాంటి వివాదాస్పద షోలకు దూరంగా ఉంటేనే బెటరని ఫీలవుతున్నారు