Begin typing your search above and press return to search.

ముచ్చటగా మూడో సారి బాలయ్య తో

By:  Tupaki Desk   |   13 Dec 2018 1:11 PM IST
ముచ్చటగా మూడో సారి బాలయ్య తో
X
ప్రస్తుతం వినయ విధేయ రామ ఫైనల్ ఐటెం సాంగ్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న బోయపాటి శీను మరో వైపు తన నెక్స్ట్ మూవీ కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బోయపాటి శీను తో బాలయ్య 105 ఉండబోతోందని సమాచారం. దీని సంబంధించిన వార్త ఇంతకుముందే లీకైనప్పటి కి శీను అఖిల్ తో చేసే అవకాశం ఉందంటూ మధ్యలో కొన్ని కథనాలు వచ్చాయి. కాని అవేవి నిజం కాదట. వచ్చే వేసవిలో షూటింగ్ ప్రారంబించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సింహ - లెజెండ్ ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. హ్యాట్రిక్ కాంబినేషన్ కావాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ప్రస్పుటంగా ఉన్నాయి. ఎన్టీఆర్ రెండు భాగాలూ జనవరిలో నే వచ్చేస్తాయి. ఒక వేళ మహానాయకుడు విషయంలో ఏదైనా నిర్ణయం మారినా మహా అయితే ఫిబ్రవరి లేదా మార్చిలో రావాలి. కాబట్టి బోయపాటి శీను దసరా లేదా దీపావళిని హ్యాపీ గా టార్గెట్ చేసుకోవచ్చు.

మొత్తానికి నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న కాంబో మరోసారి సెట్ కాబోతోంది. దీన్ని కూడా బోయపాటి శీను తన స్టైల్ లో ఫుల్ లెంగ్త్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నట్టు సమాచారం. బి గోపాల్ తర్వాత బాలకృష్ణ ను పవర్ ఫుల్ హీరోయిజంతో ప్రెజెంట్ చేయగలిగిన దర్శకుడి గా బోయపాటి శీనుకే పేరుంది. మరి హ్యాట్రిక్ మూవీ ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి