Begin typing your search above and press return to search.

'టిల్లు 2'.. సిద్దూకు ఆ హీరోయినే కావాల‌ట‌!

By:  Tupaki Desk   |   20 Dec 2022 1:30 PM GMT
టిల్లు 2.. సిద్దూకు ఆ హీరోయినే కావాల‌ట‌!
X
సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించి, ర‌చ‌యిత‌గానూ వ‌ర్క్ చేసిన మూవీ `డీజే టిల్లు`. విమ‌ల్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌ పై యంగ్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించాడు. కేవ‌లం రూ. 4 కోట్ల లోపు బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి చిన్న సినిమాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుంది. ఊహించ‌ని విదంగా `డీజే టిల్లు` బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకోవ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

దీంతో ఈ మూవీకి సీక్వెల్ చేయాల‌ని ప్లాన్ చేసుకున్నారు. `టిల్లు 2` పేరుతో ఈ మూవీకి శ్రీ‌కారం చుట్టారు. ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ త‌ప్పుకోవ‌డంతో ఆ స్లేస్ లో మ‌ల్లిక్ రామ్ ని ట్రాక్ లోకి తీసుకొచ్చారు. హీరోయిన్ గా నేహాశెట్టి ప్లేస్ లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వ‌చ్చి చేరింది. షూటింగ్ స్టార్టయింది. ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌ప్పుకుంది. త‌ను ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్న‌ట్టుగా వార్త‌లు రావ‌డంతో తెలివిగా ఎగ్జిట్‌.. ఎంట్రీ అంటూ పోస్ట్ పెట్టి త‌ను `టిల్లు 2` నుంచి త‌ప్పుకున్నాన‌ని క్లారిటీ ఇచ్చింది.

ఆ త‌రువాత మేక‌ర్స్ మ‌రో హీరోయిన్ కోసం వెతుకుతున్నార‌ని, అనుప‌మ ప్లేస్ లో `ప్రేమ‌మ్‌` ఫేమ్ మ‌డోన్నా సెబాస్టియ‌న్ వ‌చ్చేసింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే లుక్ టెస్ట్ త‌రువాత త‌ను ఈ క్యారెక్ట‌ర్ కు సెట్ కాద‌ని మేక‌ర్స్ తేల్చేశార‌ట‌.

దాంతో త‌ను కూడా సెట్ కాలేద‌ని, ఆ త‌రువాత మీనాక్షీ దీక్షిత్ కోసం టీమ్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది. ఫైన‌ల్ గా అది కూడా వట్టి వార్తే అని లేలింది. ఫైన‌ల్ గా సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌, మేక‌ర్స్ ఈ పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్మాత్ర‌మే క‌రెక్ట్ అని ఫీల‌య్యార‌ట‌.

ప్ర‌స్తుతం త‌ను ఏ స‌మ‌స్య కార‌ణంగా బ‌య‌టికి వెళ్లిందో దాన్ని ప‌క్క‌న పెట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ని మ‌ళ్లీ ఫైన‌ల్ చేసుకోవాల‌ని, త‌న‌ని మ‌ళ్లీ ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవాల‌ని చిత్ర బృందం త‌న‌తో చ‌ర్చ‌లు మొద‌లు పెట్టిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌. మ‌రి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అంగీక‌రిస్తుందా?.. మ‌ళ్లీ సెట్ లోకి అడుగుపెడుతుందా? అన్న‌ది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.