Begin typing your search above and press return to search.

ఇది హీరో కోసం చూడాల్సిన సినిమా

By:  Tupaki Desk   |   9 Dec 2018 11:22 AM IST
ఇది హీరో కోసం చూడాల్సిన సినిమా
X
హీరో కోసం సినిమాలు చూసే ఒరవడి తెలుగు లో ఎప్పుడూ ఉన్నదే. అయితే స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ల సినిమాల కోసం మాత్రమే అభిమానులు.. సామాన్య ప్రేక్షకు లు థియేటర్ల కు తరలుతారు. హీరో గా ఒక ఇమేజ్ లేని వాళ్ల విషయం లో పెద్ద గా ఆసక్తి ప్రదర్శించరు. అలాంటి సినిమాల విషయం లో వేరే ఆకర్షణలు ఉండాలి. కానీ ‘బ్లఫ్ మాస్టర్’ అనే సినిమా ప్రోమో లు చూస్తుంటే మాత్రం.. ఎలాంటి ఇమేజ్ లేని సత్యదేవ్ కోసం ప్రేక్షకులు థియేటర్ల కు వెళ్లే లా కనిపిస్తున్నారు.

తమిళ హిట్ మూవీ ‘శతురంగ వేట్టై’ కి రీమేక్‌ గా వస్తున్న ఈ చిత్రాని కి సంబంధించి ప్రతి ప్రోమో లోనూ సత్యదేవ్ హైలైట్ అవుతున్నాడు. ఇక టీజర్.. ట్రైలర్ల లో అయితే అతను అదరగొట్టేశాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్.. డైలాగ్ డెలివరీ.. నటన అన్నీ కూడా కట్టి పడేస్తున్నాయి. కథా కథనాల సంగతెలా ఉన్నా అతడి పెర్ఫామెన్స్ చూడటానికి సినిమా కు వెళ్లాలనిపించే లా చేస్తున్నాయి. ఒక ఇమేజ్ లేని నటుడు ఇంతలా ఇంపాక్ట్ చూపించడం అరుదైన విషయమే.

నాని కూడా ఇలాగే తన నటనతో సినిమాల్ని పైకి లేపుతుంటాడు కానీ అతను నెమ్మది గా ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు. మంచి మంచి సినిమాలు చేశాడు. కానీ సత్యదేవ్ టాలెంటు కి తగ్గ సినిమాలు ఇంకా పడలేదు. తొలి సారి పూర్తి స్థాయి లీడ్ రోల్‌ లో అతను నటించిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. డబ్బు కోసం ఏమైనా చేసే మోసగాడి పాత్ర లో అతను కనిపించబోతున్నాడు. తమిళంలో ఈ చిత్రం అంచనాల్లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్టయింది. మరి తెలుగు లో కూడా అలాంటి ఫలితాన్నే రాబడుతుందేమో చూడాలి. గోపీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు.