Begin typing your search above and press return to search.

కామ బుద్ధి నిర్మాతకు చెంప దెబ్బ

By:  Tupaki Desk   |   11 Jan 2018 11:52 AM GMT
కామ బుద్ధి నిర్మాతకు చెంప దెబ్బ
X
కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ప్రతి రంగంలోనూ ఉన్నారు.దానికి సినిమా పరిశ్రమ కూడా మినహాయింపు కాదు. అవకాశాల కోసం తమ దగ్గరకు వచ్చిన వారితో కొందరు నటులు - దర్శక నిర్మాతలు ఎంత వెకిలిగా ప్రవర్తిస్తారో ఈ మధ్య తరచుగా మాజీ హీరొయిన్లు - క్యారెక్టర్ ఆర్టిస్టులు పలు ఇంటర్వ్యూలలో బయట పెడుతూనే ఉన్నారు. కాని హాలీవుడ్ కు చెందిన ఈ మహానుభావుడు మాత్రం కామ ప్రకోపానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. హార్వీ వెయిన్ స్టెన్ హాలీవుడ్ లో సుప్రసిద్ధ నిర్మాత. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. కాని ఇదంతా నాణేనికి ఒక వైపు. రెండో వైపు అతనిలో మృగానికి సంబంధించినది. తన దగ్గరకు అవకాశాల కోసం వచ్చేవాళ్ళను తీవ్రంగా వేదిస్తాడని, లైంగిక వేధింపులకు గురి చేస్తాడని ఇతగాడి మీద ఎప్పటి నుంచో అభియోగాలు ఉన్నా సరైన ఆధారాలు లేక ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు పోలీసులు.

లాస్ట్ ఇయర్ ఇతనికి వ్యతిరేకంగా హాలీవుడ్ నటీమణులు ఎంజిలీనా జూలీ - గైనేత్ పాల్త్రో లాంటి వాళ్ళు ఓపెన్ కావడంతో సోషల్ మీడియాలో హార్వీ ఆగడాలకు చెక్ పెట్టాలంటూ మీ టూ పేరుతో పెద్ద ఉద్యమమే చెలరేగింది. అప్పటి నుంచి బయట తిరగకుండా తప్పించుకు తిరుగుతున్న హార్వీ మొన్న రాత్రి అంటే 9వ తేదిన ఆరిజోనాలోని పారడైజ్ రెస్టారెంట్ కు వచ్చాడు. అక్కడ ఇతన్ని గుర్తుపట్టిన స్టీవ్ అనే పౌరుడు ఫోటో తీసుకునే నెపంతో దగ్గరకు వెళ్ళి అందరు చూస్తుండగానే చెంపలు చెడామడా వాయించాడు. దీంతో ఖంగు తిన్న హార్వీ సిగ్గుతో బిక్కచచ్చి పోయాడు.

ఇది కాస్త అక్కడ ఉన్న ఓ ఔత్సాహికుడు తన సెల్ ఫోన్ కెమెరాలో షూట్ చేయటంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ గా షేర్ అయిపోయి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. స్టీవ్ ఒక్క దెబ్బతో హీరో అయిపోతే తప్పించుకు తిరుగుతున్న హార్వీ బండారం మిగిలిన ప్రపంచం కూడా తెలుసుకునే అవకాశం కలిగింది. ఇతగాడు ఆస్కార్ అవార్డు కమిటీలో సైతం మెంబెర్ గా ఉండేవాడు. ఇతని ఘనకార్యాలు తెలుసుకున్న మానేజ్మెంట్ ఇతన్ని తొలగించేసింది. ఇతని తమ్ముడు బాబ్ వెయిన్ స్టెయిన్ కూడా అన్నయ్యను అసహ్యించుకోవడం విశేషం. ఎంత డబ్బున్నా ఎంత గొప్పగా బ్రతికినా కామంతో 30 పైగా మహిళల జీవితాలతో ఆడుకున్న వాడికి తగిన శాస్తి జరిగింది అంటున్నారు చూసినవాళ్లు.