Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోకు బాలీవుడ్లో పరీక్ష

By:  Tupaki Desk   |   5 Feb 2016 1:30 AM GMT
టాలీవుడ్ హీరోకు బాలీవుడ్లో పరీక్ష
X
హర్షవర్ధన్ రానా గుర్తున్నాడా..? అదేనండీ ఔను, మాయ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌ లో కథానాయకుడి పాత్ర పోషించాడే.. ఆ ఛార్మింగ్ హీరోనే. తెలుగులో ఈ కండల హీరోకి పెద్దగా కలిసి రాలేదు. సరైన పేరు రాలేదు. అయినా చిన్నా చితకా వేషాలతోనే బండి నెట్టుకుంటూ వచ్చిన హర్షవర్ధన్ కు బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం అనూహ్యంగా పిలిచి మరీ ఒకేసారి మూడు సినిమాలిచ్చాడు. అందులో ఒకటి ‘సనమ్ తేరీ కసమ్’. జాన్ అబ్రహాం బ్యాకప్ తో దీపక్ ముకుత్ నిర్మించిన ఈ చిత్రానికి డైరెక్టర్స్ డ్యూ రాధికారావు-వినయ్ సప్రు దర్శకత్వం వహించారు. శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుండటం విశేషం.

హర్షవర్ధన్ సరసన పాకిస్థాన్ అమ్మాయి మావ్రా హొకేన్ కథానాయికగా నటించడం విశేషం. ముందు ఎవరా ఈ హర్షవర్ధన్ అని తేలిగ్గా తీసుకున్నారు కానీ.. టీజర్, ట్రైలర్లలో కుర్రాడి టాలెంట్ జనాలకు తెలిసింది. బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని బాడీ, లుక్స్ కు తోడు.. యాక్టింగ్ టాలెంట్ కూడా చూపించి ఆకట్టుకున్నాడు హర్ష. పైగా హిమేష్ రేషమ్మియా అందించిన ఆడియో సూపర్ హిట్ కావడంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. సినిమాను పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటే సన్నీడియోల్ మూవీ ‘ఘాయల్ రిటర్న్స్’ కూడా శుక్రవారమే రిలీజవుతున్నప్పటికీ.. యూత్ ఆడియన్స్ కు కనెక్టయ్యే లవ్ స్టోరీ కావడంతో ‘సనమ్ తేరీ కసమ్’ మీదే ఆసక్తి కనిపిస్తోంది. మరి హర్షకు ఈ సినిమా బాలీవుడ్లో ఎలాటి ఆరంభాన్నిస్తుందో చూడాలి.