Begin typing your search above and press return to search.

ల‌వ్ బ్రేక‌ప్ అనేది ఆ యంగ్ హీరో DNA స్వభావ‌మ‌ట‌

By:  Tupaki Desk   |   30 Oct 2020 5:00 AM IST
ల‌వ్ బ్రేక‌ప్ అనేది ఆ యంగ్ హీరో  DNA స్వభావ‌మ‌ట‌
X
బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ కిమ్ శ‌ర్మ ఎఫైర్ క‌హానీ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఆరంభం ప‌లువురు క్రికెట‌ర్ల‌తో ఎఫైర్ సాగించిన ఈ బ్యూటీ యువ‌రాజ్ సింగ్ మాజీ ప్రేయ‌సిగా పాపుల‌రైంది. ఆ త‌ర్వాత కూడా ప‌లువురు హీరోల‌తో ఎఫైర్ సాగించ‌డంలో జోరు చూపించింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

కాల‌క్ర‌మంలో కిమ్ కెన్యాకి చెందిన ప్ర‌ముఖ బిజినెస్ మేన్ అలీ పుంజానీని పెళ్లాడింది. ఇక అత‌డిపై మాఫియా అంటూ అప్ప‌ట్లో మీడియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ త‌ర్వాత కిమ్ అత‌డి నుంచి విడిపోయింది. ఆ క్ర‌మంలోనే యంగ్ హీరో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేతో ప్రేమ‌లో ప‌డింది. ఓ మూవీలో జంట‌గా క‌లిసి న‌టించిన క్ర‌మంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమ చిగురించింది. అయితే ఏడాది రెండేళ్ల‌లోనే ఈ జంట ప్రేమ‌కు క‌టీఫ్ చెప్పేయ‌డం అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఎందుక‌ని విడిపోయారు? అని ప్ర‌శ్నించిన ప్ర‌తిసారీ హ‌ర్ష నుంచి స‌రైన ఆన్స‌ర్ లేదు. కానీ ఈసారి మాత్రం దాచుకోలేదు. నిజం ఓపెన‌య్యాడు. ప్రేమ బ్రేక‌ప్ అనేది త‌న డీఎన్ ఏ లోనే ఉంద‌ని చెప్పి షాకిచ్చాడు. ఒంట‌రిగా ఉండ‌డం త‌న‌కు అల‌వాటేన‌న్నాడు. 12 ఏళ్లుగా అలానే ఉన్నాడ‌ట‌. అవును.. బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళీ .. ఫిదా చిత్రాల్లో న‌టించాడు హ‌ర్ష‌వ‌ర్థ‌న్. భూమిక నిర్మించిన త‌కిట త‌కిట‌తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఖ‌డ్గం చిత్రంలో కిమ్ శ‌ర్మ న‌టించింది.