Begin typing your search above and press return to search.

మహేష్ మూవీకి మ్యూజిక్ టెన్షన్

By:  Tupaki Desk   |   15 Jun 2016 6:44 AM GMT
మహేష్ మూవీకి మ్యూజిక్ టెన్షన్
X
తమిళ్ లో హారిస్ జైరాజ్ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అయినా సరే టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ రావు. భారీ చిత్రాలే కాదు.. అసలు ఆఫర్ ఇచ్చేందుకే అందరూ భయపడతారు. ఇందుకో స్పెషల్ రీజన్ ఉంది. ఈయన మ్యూజిక్ ఇస్తే.. కచ్చితంగా ఆ పాటలు సూపర్ హిట్ అయిపోయి చార్ట్ బస్టర్స్ లో ఉంటాయి. బ్రహ్మాండమైన కంపోజిషన్ తో అన్నిపాటలు హిట్ చేసేస్తాడు. అయినా సరే హారిస్ సంగీతం ఇచ్చిన ఒక్క తెలుగు సినిమా కూడా ఆడిన హిస్టరీ ఇప్పటివరకూ లేదు.

15 ఏళ్లుగా స్వరాలు సమకూరుస్తున్న హారిస్.. కేవలం ఐదంటే ఐదు తెలుగు సినిమాలకు మాత్రమే మ్యూజిక్ ఇచ్చాడు. వాసు - ఘర్షణ - సైనికుడు - మున్నా - ఆరంజ్.. ఇప్పుడు మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్ లో రానున్న మూవీకి హారిస్ జయరాజ్ నే ఫిక్స్ చేశారు. ఇప్పటికే రెండు సాంగ్స్ కంపోజ్ చేసి సూపర్ స్టార్ కి వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాడీ మ్యూజిక్ డైరెక్టర్. మహేష్ లండన్ నుంచి రాగానే చేసే ఫస్ట్ పని.. ఈ ట్యూన్స్ ను ఫైనల్ చేయడమే.

కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం పాత హిస్టరీ తలుచుకుని బెంబేలు పడిపోతున్నారు. బ్రహ్మాండమైన మ్యూజిక్ తో మూవీపై అంచనాలు పెరిగిపోతాయి. కానీ ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కాకపోతే పొజిషన్ ఏంటో ఇప్పటికే అనుభవం అయింది. అందుకే ఈసారైనా హారిస్ మ్యూజిక్ తో పాటు.. సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.