Begin typing your search above and press return to search.

వెండి తెర వెన్నెలలు కురిపించడానికి విశ్వ సుందరి రెడీ...

By:  Tupaki Desk   |   17 Dec 2021 2:30 AM GMT
వెండి తెర వెన్నెలలు కురిపించడానికి విశ్వ సుందరి రెడీ...
X
విశ్వ సుందరి కిరీటాన్ని సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ళకు భారత్ గెలుచుకుంది. ఆ ఘనతను పంజాబీ రాష్ట్రంలోని చండీగడ్ కు చెందిన ముద్దు గుమ్మ హర్నాజ్ కౌర్ సంధు సాధించింది. ఆమె వయసు కూడా 21 ఏళ్ళే. అంటే చివరి సారిగా భారత్ కి విశ్వ సుందరి కిరీటం దక్కేవేళకు హర్నాజ్ కౌర్ సంధు కళ్ళు తెరిచింది అన్న మాట.

ఆనాడు ఈ పసి కూన అనుకోని ఉండదు, తాను పెరిగి పెద్దయ్యేంతవరకూ భారత్ కి విశ్వ సుందరి కిరీటం దక్కకుండా ఉంటుందని. కానీ అదే జరిగింది. ఆమె కారణ జన్మురాలిగా మారి భారత్ కి అందాల కిరీటాన్ని మోసుకొచ్చింది. సరే ఇపుడు దేశమంతా ఆమె పేరు మారుమోగుతోంది. ఈ అమ్మడు గురించి కూడా అంతా ఆరా తీస్తున్నారు. ఆమెకు ముందు విశ్వ సుదరులుగా కిరీటాన్ని తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్, సుస్మితాసేన్ లాంటి వారు సినీ రంగాన రాణించిన వారే.

ఇపుడు ఈ అమ్మడును గురి చూసి మరీ వెండితెర కెమెరా కన్ను కొడుతోందిట. ఇంతకీ హర్నాజ్ కి హీరోయిన్ గా భారతీయ సినీ ప్రపంచంలో వెలిగిపోవాలని కోరిక ఉందా అంటే ఉంది అనే సమాధానం వస్తోంది. ఆమె విశ్వ సుందరి కాక ముందే సినీ ఆరంగేట్రం చేసిందట. అయితే చేసినవి కొన్ని పంజాబీ సినిమాలు మాత్రమే. దాంతో ఆమె పెద్దగా ఫోకస్ కాలేదు. ఈ నేపధ్యంలో ఇపుడు ఇంటర్నేషనల్ ఫేమ్ అయింది. ఎనభై దేశలలోని అందగత్తెలను వెనక్కి నెట్టి ముందుకు దూసుకువచ్చింది.

మరి ఈ విశ్వసుందరికి సినీ సీమ స్వాగతించకుండా ఊరుకుంటుందా. ఆమెకు ఇపుడు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయట. బాలీవుడ్ నుంచే ఆమెకు భారీ పిలుపు ఉందని టాక్ నడుస్తోంది. ఆమె సొగసరి మాత్రమే కాదు, పొడగరి, గడుసరి కూడా దాదాపుగా ఆరడుగుల ఎత్తున్న ఈ సుందరి టాల్ హీరోయిన్ గా టాప్ రేపే స్థాయిలో రాణిస్తుంది అనే చెబుతున్నారు.

తన అత్మ విశ్వాసమే ఈ కిరీటాన్ని దక్కేలా చేసింది అంటున్న హర్నాజ్ డ్యాన్సులో సూపరంట. అంతే కాదు, గుర్రపు స్వారీలో ఆమెకు టాలెంట్ ఉందిట. ఇక స్విమ్మింగ్ తో పాటు యోగా చేయడం ద్వారా తన అందానికి మరిన్ని కొత్త మెరుగులు దిద్దుకుంటానని చెబుతోంది హర్నాజ్. భారతీయ వెండితెర మీద వెన్నెలలు కురిపించ‌డానికి కొత్తగా ఈ విశ్వసుందరి పుట్టింది. ఇక ఆమెను సిల్వర్ స్క్రీన్ మీద ఏ సినిమా ద్వారా చూసి తరించాలో తెలియకపొయినా కాస్తా వేచి చూడడమే అందాల ఆరాధకులకు మిగిలింది.