Begin typing your search above and press return to search.
బన్ని-రౌడీలను స్టైల్ ఐకాన్ లుగా మలిచిన ఆమె ఎవరు?
By: Tupaki Desk | 5 Aug 2022 4:00 AM GMTకంటెంట్ బేస్డ్ యుగంలో స్టార్లు తమను తాము నిరంతరం లైమ్ లైట్ లో నిలుపుకోవాలంటే ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం యూనిక్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ ని అనుసరించడం. ప్రతిభతో పాటు స్టైల్ కంటెంట్ ప్రచారం చాలా ముఖ్యం. యూనిక్ క్వాలిటీ స్ లేనిదే హీరోలు కానీ హీరోయిన్లు కానీ రాణించడం అంత సులువేమీ కాదని నిరూపణ అయ్యింది. ఒకప్పుడు ఇండస్ట్రీ ఈవెంట్ లు.. ప్రీమియర్ లు ఇతర ఈవెంట్లలో స్టార్లు చాలా సాధాసీదాగానే కనిపించేవారు. కానీ కాలక్రమంలో అంతా మారింది. ఈవెంట్లలోనూ తామేంటో చూపించాలని తపిస్తున్నారు.
ఇటీవల స్టార్లకు సెలబ్రిటీ స్టైలిస్ట్ అవసరం తప్పనిసరి అయ్యింది. సంఘంలో సెలబ్రిటీ హోదాను కలిగి ఉండటానికి స్టైలిస్ట్ పాత్ర కీలకంగా మారింది. కిరాణా దుకాణానికి వెళ్లడం నుండి ఎయిర్ పోర్ట్ లుక్ లు.. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ వరకూ ప్రతిదానికీ స్టైలిస్ట్ లు డిజైన్ చేయాల్సి వస్తోంది.
ప్రముఖ డిజైనర్లు ఎందరు ఉన్నా దక్షిణాదిన పాపులరైన హర్మాన్ కౌర్ గొప్ప ప్రతిభావనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణాది స్టార్లకు ఆమె ఎక్కువగా పని చేశారు. దీంతో ఇక్కడ హార్మన్ కు గొప్ప గౌరవం దక్కింది. హర్మాన్ దేశంలోని అత్యంత డిమాండ్ ఉన్న స్టైలిస్ట్ లలో ఒకరిగా ఉన్నారు. బ్రాండ్ షూట్ లు.. ఈవెంట్ లు.. సినిమా రంగాలకు సంబంధించి ప్రత్యేకంగా మేల్ దుస్తుల డిజైనింగ్ లో ఆమె గొప్పతనం ప్రూవ్ అయ్యింది. ఆమె పాపులర్ బ్రాండ్స్.. లాంగిన్స్- సెలియో- ఫ్లిప్ కార్ట్ - జొమాటో- సిగ్నేచర్ వన్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలకు పని చేసింది. హార్మన్ పనితనంపై ఫోర్బ్స్- ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ -JWS వంటి అగ్రశ్రేణి మ్యాగజైన్లలో ప్రచురితమైంది.. సెలబ్రిటీ స్టైలిస్ట్ గా ఆమె ఎదుగుదలలో టాలీవుడ్ కీలక పాత్ర పోషించింది. టాలీవుడ్ స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్ కి వ్యక్తిగత స్టైలిస్ట్ గా హర్మాన్ తన రూపాన్ని మార్చేయడంలో సక్సెసయ్యారు.
హర్మాన్ 2014లో ఫ్యాషన్ స్టైలిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. గీత గోవిందం- బీష్మ- ABCD- అల వైకుంఠపురములో - A1 ఎక్స్‌ప్రెస్ వంటి టాలీవుడ్ సినిమాలకు హార్మన్ పని చేసారు. కౌర్ జైపూర్ లో జన్మించారు. హైదరాబాద్ కు వెళ్లడానికి ముందు ... ఆమె సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి సైకాలజీలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుండి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది.
హార్మాన్ కి విమానాలంటే చాలా ఇష్టం. దానివల్ల పోస్ట్-గ్రాడ్యుయేషన్ తర్వాత తన విమానయాన కలను సాకారం చేసుకోవడానికి మొండిపట్టుదలను కనబరిచారు. దీనివల్ల హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీలో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చేరడానికి కారణమైంది. దురదృష్టవశాత్తూ ఏవియేషన్ సెక్టార్ లో ఆశించిన ఉద్యోగాలు లేకపోవడంతో కొంత నిరుత్సాహపడింది. ఈ రంగంలో ఆమెకు వచ్చిన మొదటి అవకాశాన్ని చేజార్చుకుంది. న్యూస్ ప్రెజెంటర్ .. టీవీ టాక్ షో హోస్ట్ గా తన కొత్త పాత్ర గురించి వెల్లడించగానే హార్మన్ స్నేహితులు కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారట.
జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే హర్మాన్ కొంతవరకూ అనుకున్నది సాధించుకుంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు హార్మన్ ఇప్పుడు గర్వంగా ఉంది. చివరికి సెలబ్రిటీ స్టైలిస్ట్ గా కాస్ట్యూమర్ గా పూర్తి బిజీ లైఫ్ లో స్థిరపడింది. సక్సెస్ కోసం ఎలాంటి అడ్డంకినైనా అధిగమించగల ఆమె సామర్థ్యంపై దృఢమైన నమ్మకం ఇండస్ట్రీలో కలిగింది. టాలీవుడ్ లో అల్లు అర్జున్ -రానా దగుబాటి - విజయ్ దేవరకొండ-కాజల్ అగర్వాల్ వంటి ప్రఖ్యాత తారలకు స్టైలిష్ట్ గా పని చేస్తున్నారు.